సుమ యాంకర్ అయినప్పటికీ ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతాకాదు. స్టార్ హీరోయిన్‌ని మించిన క్రేజ్ సుమకు ఉంది. కొన్ని దశాబ్ధాలుగా తన యాంకరింగ్‌తో తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న సుమ ఇటీవల తన భర్తతో విడాకుల విషయంపై వార్తలలో నిలిచింది. సుమ, రాజీవ్‌ల మధ్య మనస్పర్ధలు పీక్ స్టేజ్‌కు చేరడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారని , సుమ గచ్చిబౌలిలో ఉంటే.. రాజీవ్ కనకాల మణికొండలో ఉన్న ఇంట్లో ఉంటున్నాడని పుకార్లు షికారు చేశాయి. ఇవి మరి తారాస్థాయిలో చేరుతుండడంతో స్పందించిన సుమ అనవసరంగా మా సంసారంలో నిప్పులు పోయోద్దంటూ గాసిప్ రాయుళ్ళపై మండిపడింది.
ఈ మధ్య సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ షోకి రాజీవ్ కనకాల రాగా, వారిద్దరు షో అని మరచిపోయి చాలా అన్యోన్యంగా ఉన్నారు. మిగతా కంటెస్టెంట్స్ వారిని చూసి అసూయ చెందారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని ఈ షోతో క్లారిటీ ఇచ్చే ప్రయత్న చేశారు రాజీవ్ దంపతులు. మరోవైపు రీసెంట్‌గా తన భర్త పుట్టిన రోజు సందర్భంగా సుమ పెట్టిన పోస్ట్ కూడా అందరికి పూర్తి క్లారిటీ వచ్చేలా చేసింది. అయితే ఈ విడాకులు, గొడవల గురించి తాజాగా మాట్లాడిన రాజీవ్ కనకాల.. సుమతో వాగ్వాదం జరిగిన విషయం నిజమే అన్నాడు.
మా మధ్య జరిగిన గొడవ విడిపోయే అంత పెద్దది కాదని చెప్పిన రాజీవ్ కనకాల దీనిని అనవసరంగా పెద్దది చేసారు. భార్య భర్తలు అన్న తర్వాత గొడవలు సహజం. మా మధ్య జరిగినది చాలా చిన్నది. మీడియానే దానిని చాలా పెద్దది చేసి చూపించింది. ఇప్పుడు మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. అన్నీ సమసిపోయాయి అని క్లారిటీ ఇచ్చారు రాజీవ్. ప్రస్తుతం ఈ దంపతులు తమ దృష్టి మొత్తం కొడుకు రోషన్ ను హీరోగా నిలబెట్టడం పైనే పెట్టారు. ఇటీవల రోషన్ సినిమాకి సంబంధించి గుడిలో శాస్త్రోక్తంగా స్క్రిప్ట్‌కు పూజలు చేశారు. అతని డెబ్యూ చిత్రం నూతన దర్శకుడు విజయ్ తెరెక్కిస్తున్నాడు. జేబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు.