మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది. ఈ మేరకు చిరంజీవి తన ఆరోగ్య పరిస్జితిపై ట్వీట్ చేశాడు. ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను అని పేర్కొన్నాడు.
అయితే తాజాగా యాంగ్రీ హీరో రాజశేఖర్ కరోనా నుంచి కోలుకున్నాడు. హాస్పిటల్‌లో గత కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్న రాజశేఖర్ తాజాగా డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లాడు. ఈ మేరకు హాస్పిటల్ బృందానికి జీవిత ధన్యవాదాలు తెలిపింది. ఇలా చిరు కరోనా బారిన పడటం.. రాజశేఖర్ కరోనా నుంచి కోలుకోవడం రెండూ ఒకే రోజు జరిగాయి.
గత కొన్ని రోజుల కిందట రాజశేఖర్ ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడింది. అయితే అందరూ త్వరగానే కోలుకున్నారు. కానీ రాజశేఖర్ విషయంలోనే కాస్త ఆందోళన కరంగా మారింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ ఆయనకు ఎప్పుడూ వెంటిలేటర్ మీద చికిత్స అందించలేదని, అలా వస్తోన్న వార్తలు అవాస్తవమని జీవిత పేర్కొంది. ఐసీయూలోనే ఆక్సిజన్ అందిస్తూ చికిత్స చేశారు. అనంతరం ప్లాస్మా థెరపీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి రాజశేఖర్‌కు కరోనా నెగెటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.