ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయనే నానుడి మనందరికి తెలిసిందే. ఒకప్పుడు ఎంతో హుందాగా బతికిన వారు ఆర్దిక సమస్యల వలన రోడ్డున పడిన సందర్భాలు లేకపోలేదు. సినీ పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. స్టార్ స్టేటస్ పొందిన వాళ్లు నిర్మాతలుగా సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. అందులో యాంగ్రీయంగ్‌మెన్ రాజశేఖర్ కూడా ఒకరు. 90ల సమయంలో రాజశేఖర్ ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేసి స్టార్ స్టేటస్ పొందాడు. పోలీస్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్కోసారి వరుస సినిమాలతో బిజీగా ఉండడం వలన చాలా ప్రాజెక్ట్స్ వదులుకున్నాడు. అయితే తన ఇబ్బందుల గురించి ఎప్పుడు పెద్దగా బయటకు చెప్పుకొని రాజశేఖర్ రీసెంట్‌గా మనసులోని భాదలను సన్నిహితుల దగ్గర వెళ్లగక్కినట్టు తెలుస్తుంది.
2000 సంవత్సరం తర్వాత రాజశేఖర్‌కు గడ్డు పరిస్థితి నెలకొంది. ఏదో అడపాదడాపా సినిమా ఆఫర్స్ వచ్చేవి. అవి ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్లాయో కూడా ఎవరికి తెలిసేది కాదు. తలంబ్రాలు, వందేమాతరం లాంటి సినిమాలతో కెరీర్ మొదలు పెట్టి.. అంకుశం, ఆహుతి, మగాడు లాంటి సినిమాలతో యాంగ్రీ యంగ్ మ్యాన్ అనిపించుకున్న రాజశేఖర్. ‘అన్న’, అల్లరి ప్రియుడు’ ‘శివయ్య’, ‘మనసున్న మారాజు’, ‘మా అన్నయ్య’, సింహరాశి, ‘ఎవడైతే నాకేంటి’, ‘గోరింటాకు’ లాంటి విజయాలతో స్టార్ స్టేటస్ అందుకున్నాడు.
మూడేళ్ల కింద PSV గరుడ వేగ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటుకున్నాడు రాజశేఖర్. అయితే మధ్యలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి రీసెంట్‌గా తన సన్నిహితుల దగ్గర వివరించారు రాజశేఖర్ . కొన్ని సినిమాలకి నిర్మాతగా పనిచేయడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుల బాధ తట్టుకోలేక చెన్నైలో ఉన్న రెండు ఇళ్ళను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ చెప్పారట. స్టార్ హీరోకు ఇలాంటి పరిస్థితి రావడం దారుణం అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కరోనా బారిన పడ్డ రాజశేఖర్ నెల రోజుల తర్వాత మాములు స్థితికి వచ్చిన సంగతి తెలిసిందే.