సీనియర్ హీరో రాజశేఖర్ ప్రతిసారి ఎదో ఒక వివాదంతో హాట్ టాపిక్ గా నిలవడం కామన్. ఓ వర్గం వారు ఆయనతో ఏకీభవిస్తారు కూడా. ఇక చాలా రోజుల తరువాత రాజశేఖర్ మరొక కాంట్రవర్సీ రూమర్స్ తో మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. ఒక సినిమా కారణంగా దర్శకుడితో గొడవ అయినట్లు తెలుస్తోంది.
రాజశేఖర్ గారుడవేగ సినిమా తరువాత కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఉహీంచని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఇక ఎలాగైనా ఇప్పుడు హిట్ కొట్టాలని ఒక మలయాళం రీమేక్ సినిమాను లైన్ లో పెట్టారు. దర్శకుడిగా మొదట నిలకంఠను అనుకున్నారు. అయితే సినిమా కథలో చర్చలు జరుగుతున్న క్రమంలో ఇద్దరికి విబేధాలు వచ్చినట్లు సమాచారం.
ఇక ఫైనల్ గా ఆ ప్రాజెక్టును జీవిత రాజశేఖర్ చేతుల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరోసారి ఆమె రాజశేఖర్ ను డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యారట. గతంలో శేషు, ఎవడైతే నాకేంటి, సత్యమేవజయతే, మహంకాళి వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన జీవిత మరోసారి తన భర్త సినిమాను డైరెక్ట్ చేయడానికి రెడీ అయినట్లు టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. మరి ఈసారైనా జీవిత రాజశేఖర్ బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకుంటారో లేదో చూడాలి.