‘పుష్ప’ మార్కెటింగ్.! ఓ చెయ్యేస్తున్న రాజమౌళి.!

సినిమాని ఎలా తెరకెక్కించామన్నది కాదన్నయ్యా..! నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ సినిమాని ఏ రేంజ్‌లో మార్కెటింగ్ చేశామన్నదే ఇంపార్టెంట్.

ఓ మామూలు సినిమాని సైతం మార్కెటింగ్ స్కిల్స్‌తో హిట్టూ సూపర్ హిట్టు, బంపర్ హిట్ సినిమాగా మార్చేయొచ్చు.

యస్.! ఎగ్జాట్లీ.. ఆ మార్కెటింగ్ స్కిల్స్ తెలిసినోడే జక్కన్న రాజమౌళి. తన సినిమాలను ఆ రేంజ్‌లో మార్కెట్ చేస్తాడు కాబట్టే.. ఆ స్థాయిలో సక్సెస్ అవుతుంటాయ్ రాజమౌళి సినిమాలు.

ఇక, ‘పుష్ప’ మొదటి పార్ట్ విషయానికి వస్తే కూడా.. ఇదే స్ట్రేటజీ వర్కవుట్ అయ్యింది. కేవలం సినిమాలో కంటెంట్ పట్టించుకోకుండా సినిమాని అంత పెద్ద హిట్ చేశారంటే అందుకు కారణం ఈ మార్కెటింగ్ స్కిల్సే.

ఇక, రెండో పార్ట్‌పై వున్న హైప్ సంగతి తెలిసిందే. ఆ హైప్‌ని అలాగే వుంచాలన్నా.. అంతకు మించి పెంచాలన్నా.. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ స్థాయి మార్కెటింగ్ స్కిల్స్ సరిపోవు.

రాజమౌళి రేంజ్ వుండాల్సిందే. అసలే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న హీరో అల్లు అర్జున్. అలాంటి అల్లు అర్జున్ తదుపరి సినిమా పట్ల అంచనాలు ఆకాశాన్నంటాలంటే.. రాజమౌళి సాయం తప్పక తీసుకోవాల్సిందే.

అదే పనిలో బిజీగా వున్నారట ఆల్రెడీ అల్లు అర్జున్ అండ్ సుకుమార్ టీమ్. రాజమౌళి సూచనలూ, సలహాలతో ఇప్పటి నుంచే ‘పుష్ప 2’ మార్కెటింగ్ పనులకు శ్రీకారంత చుట్టేశారట. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.