Bahubhali : బాహుబలి 3 నిజంగా వస్తోందా..జక్కన్న ఏంచెప్పారో తెలుసా??

Bahubhali : తెలుగు సినిమా అయితే బాహుబలి కి ముందో లెక్క బాహుబలి తర్వాత ఒక లెక్క అన్నట్టు మారింది.బాహుబలి సినిమా ప్రపంచం మొత్తం తెలుగు సినిమావైపు తిరిగేలా చేసింది. రికార్డులను బద్ధలుకొట్టి తెలుగు సినిమా పేరు ను ప్రపంచవ్యాప్తం చేసింది. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి అందరిని ఆకట్టుకుంది. ఇక మూడో భాగం రానుందనే వార్త ఆసక్తిని రేపుతోంది.

బాహుబలి తో ప్రభాస్ తిరుగులేని పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు.ఇప్పటివరకు ఎవరూ అందుకొలెని కలెక్షన్స్ ను కూడా అందుకున్నారు. ఈ దెబ్బ తో జక్కన్న దశ తిరిగింది.సినీ పరిశ్రమల నుంచి చాలా మంది హీరోలు, హీరోయిన్స్ రాజమౌళితో కలిసి పని చేయాలి అని అనుకుంటున్నారు.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు బాహుబలి 3 ను తెరకెక్కిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక వేళ ఆ సినిమా వస్తే ఆదరిస్తారా?ఇలాంటి ప్రశ్నలు అందరికి వస్తున్నాయి. బాహుబలి థర్డ్ పార్ట్ పై రాజమౌళి స్పందించారు. ప్రస్తుతం క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఉన్న రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాహుబలి 3 వ పార్ట్ ను కూడా తీసుకురావాలనే ఆలోచనలో జక్కన్న వున్నట్లు చెప్పాడు.అంతేకాదు నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఆసక్తిగా ఉన్నాడని చెప్పారు.. అయితే ఈ సినిమా రావడానికి కాస్త సమయం పడుతుందని అన్నారు. మరి ఆ సినిమా ఎప్పుడూ వస్తుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాలి.