RRR: విజయేంద్ర ప్రసాద్ ఎందుకు ఆర్ఆర్ఆర్ కు దూరంగా ఉన్నారు..?

RRR:దర్శకధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లతో తీసిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు చిత్రబృందం చాలా చురుగ్గా చేస్తోంది. ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ ముగ్గురు ఇంటర్వ్యూ లకు బిజీగా ఉన్నారు.ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు.

రిలీజ్‌ సయమం దగ్గరపడటంతో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఈ నెల 19న కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో గ్రాండ్‌గా ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్‌. ఆదివారం గుజరాత్‌లోని బరోడా, ఢిల్లీలో ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టింది. సోమవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పర్యటించింది చిత్రబృందం.

తాజాగా ఆర్ఆర్ఆర్’ సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఎన్టీయార్, చరణ్‌లను ఇంటర్వ్యూ చేశారు. ప్రమోషన్ కార్యక్రమాలు బాగా జరుగుతున్న అన్నింటిలోనూ ఒక లోటు మాత్రం అభిమానులకు కనిపిస్తోంది. అదే, ఆర్ఆర్ఆర్ సినిమాకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ ఎక్కడా కనిపించడం లేదు. మామూలుగా తాను కథలు అందించిన సినిమాల ప్రమోషన్లలో విజయేంద్రప్రసాద్ కాస్త ఎక్కువగానే కనిపిస్తారు.స్వయానా రాజమౌళి తండ్రి అయిన విజయేంద్రప్రసాద్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్లలో కనిపించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గతంలో బాహుబలి ప్రమోషన్ హలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఆఖరికి లాక్డౌన్ ఈ సమయంలో కూడా మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లకు దూరంగా ఉండటం అభిమానులకు ప్రశ్నగానే ఉంది.అయితే, వయసు సంబంధిత సమస్యల కారణంగా కోవిడ్ పాండమిక్ సమయంలో రిస్క్ చేయడం ఎందుకని విజయేంద్రప్రసాద్ తనంతట తానే ఈ ప్రమోషన్లకు దూరంగా వుంటున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. మరొక సినిమాకు సంబంధించిన కథల విషయంలో ఆయన బిజీగా ఉన్నారు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా విజయేంద్రప్రసాద్ లోటు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో కనిపిస్తోంది