RRR : ఆర్ఆర్ఆర్ ఒక వైపు కలెక్షన్ల మోత మొగిస్తుంటే మరోవైపు మా హీరో బాగా చేసాడు మా హీరో బాగా చేసాడు అంటూ అభిమానుల మధ్య వాదనలు మాత్రం తగ్గడం లేదు. సినిమాను సినిమాల చూడండ్రా బాబు అంటే మా హీరోకి ఎలివేషన్ ఇవ్వలేదు. మా హీరోకి స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు అంటూ నానా రభసా చేస్తున్నారు.ఇక ఇంకో బ్యాచ్ కూడా ఉంది మీ హీరోకంటే మా హీరో చాలా బాగా చేసాడు మీవాడు ఆ సన్నివేశంలో తేలిపోయాడు అంటూ పనిలేని వాదనతో రచ్చ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇద్దరు వాళ్ల కెరీర్ లోనే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి నటులుగా ఒక మెట్టు పైకి ఎక్కారు. ఇండియా మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేసారు.
ఇక రాజమౌళి మీడియా ఇంటర్వ్యూ ల్లో తన ఇద్దరి బాయ్స్ ని మెచ్చుకుంటూ వారి నటనా డాన్సులను ప్రశంసించారు. ఇక హాలీవుడ్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూ లో తన సినిమాలో ది బెస్ట్ ఎపిసోడ్ గా కొమరం భీముడో సాంగ్ నిలుస్తుందని చెప్పారు. రామరాజు గా చరణ్ అద్భుతంగా నటించాడని చెప్పాడు.అంతా బాగానే ఉన్నా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో రాజమౌళి ఎన్టీఆర్ నటనను గురించి చెబుతూ ఇది అతి పెద్ద స్టేట్‌మెంట్ అని తనకు తెలుసు, కానీ దానికి అన్ని విధాలా జూనియర్ ఎన్టీఆర్ అర్హుడు అంటూ కితాబిచ్చారు.
‘కొమురం భీముడో’ పాటలో జూనియర్ ఎన్టీఆర్ ప్రదర్శించిన హావభావాలు, ఇండియాలో మరే ఇతర నటుడు ప్రదర్శించలేడని, ఇది చాలా పెద్ద ప్రకటన అని నాకు తెలుసు, కానీ ఆ మేరకు తారక్ నటించాడని దర్శకధీరుడు చెప్పుకొచ్చారు. ఒకే షాట్ లో అన్ని ఎమోషన్స్ పండించడం ఎవరి వల్లా కాదని, అది నటనకు ఎవరెస్టుగా కీర్తించారు. అయితే ఇపుడు చర్చంతా ఎన్టీఆర్ ను మాత్రమే పొగిడితే రామ్ చరణ్ అభిమానులు హర్ట్ అవ్వరా అని చర్చించుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ ఫాన్స్ అసలే రాజమౌళి పై గుర్రుగా ఉన్నారు అందుకని ఇలా పొగుడుతున్నారని చరణ్ ఫాన్స్ భావిస్తున్నారట.