కొన్ని సినిమాలకు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చెరిగిపోని స్థానం ఉంటుంది. అలాంటి స్థానాన్ని సంపాదించుకున్న సినిమానే “కిరణ్ అబ్బవరం” హీరోగా “రవికిరణ్ కోలా” దర్శకత్వం వహించిన “రాజావారు రాణిగారు”. నేటికీ ఆ సినిమా వచ్చి మూడేళ్లు అయింది. సినిమాను ఇప్పుడు చూసిన మంచి అనుభూతి కలుగుతుంది.
ఈ సినిమా విషయానికి వస్తే రాజా (కిరణ్ అబ్బవరపు) అనే ఒక మాములు కుర్రాడు, నిజ జీవితంలో అందరి కుర్రాళ్లు లాగానే రాణి (రహస్య గోరక్) అనే అమ్మాయి తో ప్రేమలో పడతాడు.కానీ తన ప్రేమను రాణి తో చెప్పడానికి లోలోపల ఒక రకమైన భయంతో ఉంటాడు.తన ప్రేమను రాణి తో చెప్పే టైం కి ఊరు విడిచి వెళ్ళిపోతుంది.రాజా తన ప్రేమను ఎలా నిలబెట్టుకున్నాడు అనే కథాంశాన్ని సాగే చిత్రమే రాజావారు రాణిగారు.
రవికిరణ్ కోలా ఒక మాములు కథను తీసుకుని మనసుకి హత్తుకునేలా తీసాడు,సినిమాని చూస్తున్నంతసేపు మన బాల్య జ్ఞాపకాల లోనికి తీసుకెళ్లిపోయాడు. మనం మర్చిపోలేని అనుభూతులును ఒక మూట లా కట్టి వెండితెరపై పరిచేసాడు.సినిమాని చూస్తున్నంతసేపు థియేటర్ లో కూర్చున్నాం అనే ఫీలింగ్ రాకుండా ఆ ఊరి మధ్యలో కూర్చోబెట్టేస్తాడు, సినిమాలో చేసిన ప్రతీ ఒక్కరికీ గుర్తుండే పాత్రలను రాసాడు దర్శకుడు రవి కిరణ్, ఈ సినిమాలో రాజా పాత్రలో నటించిన “కిరణ్ అబ్బవరం” మనలో ఒకడిలా అనిపిస్తాడు. తన మొదటి సినిమాతోనే సరైన సక్సెస్ అందుకున్న కిరణ్, ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు.
సినిమాకి కొత్త పాత లేదు మంచిగా తీస్తే చాలు ఆ సినిమాకి సరైన ఆదరణ లభిస్తుందని మూడేళ్ళ క్రితమే ప్రూవ్ చేసిన రాజావారు రాణిగారు.