అందరూ కలిసి ఇలా చేస్తారా?.. బ్రహ్మాజి పరువు మొత్తం పోయింది!!

ఐదు పదుల వయసు మీద పడినా ఇంకా పాతికేళ్ల కుర్రాడిలా ఉంటాడు బ్రహ్మాజి. అయితే కనిపించడానికి మాత్రమే కాదు పనుల్లోనూ, చేతల్లోనూ అలానే ఉంటాయి. సోషల్ మీడియాలో బ్రహ్మాజిలా యాక్టివ్‌గా ఉండే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఎవ్వరూ లేరు. రూమర్లపై, నెటిజన్లు వేసే కౌంటర్లకు బ్రహ్మాజీ అంతే స్టాయిలో కౌంటర్లు వేస్తుంటాడు. అలాంటి బ్రహ్మాజిని క్యాష్ షోలో అందరూ కలిసి ఓ ఆటాడేసుకున్నారు.

Raja Ravindra Satires On Brahmaji In Cash Show

సుమ హోస్టింగ్ చేసే క్యాష్ షో ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ప్రతీ వారం ఓ నలుగురు సెలెబ్రిటీలను తీసుకొచ్చి.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. తాజాగా వచ్చే వారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈసారి సమీర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, బ్రహ్మాజిలు అతిథులుగా విచ్చేశారు.

ఈ షోలో ఎంట్రీ ఇచ్చేటప్పుడు అందరికీ స్పెషల్‌గా ఓ సాంగ్ వేస్తుంటారు. అలాగే బ్రహ్మాజీకి కూడా వేశారు. భరత్ అనే నేను సినిమాలో ముసలి తాత ముడత మొహం మురిసిపోయేనే (వచ్చాడయ్యో సామీ) అనే పాటను వేయగా.. వణుకుతూ ఉన్న బ్రహ్మాజిని రాజా రవీంద్ర, సమీర్ ఇద్దరూ పట్టుకుని వస్తారు. ఇలా రావడానికి కారణం నీ వయసా? నిన్న నైట్ తీసుకున్నదా? అని బ్రహ్మాజిని చూసిన సుమ కౌంటర్ వేసింది. దీంతో దెబ్బకు మొహం మాడిపోయింది.

Raja Ravindra Satires On Brahmaji In Cash Show

మళ్లీ వెంటనే అందుకున్న సుమ.. మీ ఆరోగ్యం బాగానే ఉందా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 60 యేళ్లు పైబడిన వారు బయట తిరగకూడదంటూ మరో సెటైర్ వేసింది. ఇక ఎంట్రీలో బ్రహ్మాజికి సుమ రెండు కౌంటర్లు వేసింది. ఇక రాజా రవీంద్ర మాట్లాడుతూ బ్రహ్మాజిపై కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తూనే ఉన్నాడు. వాళ్లిద్దరూ నీతో ఆడుకుంటున్నార్రా పిచ్చి నా కొడకా అని , ఇక్కడే ఆడే పెద్ద మనిషి అంటూ మరోసారి, బుడంకాయ్ అంటూ ఇంకోసారి, మీరేమో మంచి పాటలు వేసుకుంటున్నారు మా బ్రహ్మాజికి ముసలోడు ముసలోడు అంటూ వేస్తారా? అని మరోసారి ఇలా వెంట వెంటనే బ్రహ్మాజి మీద సెటైర్లు వేసి పరువుదీశారు.