అలాంటి సిల్లీ ప్రశ్నలు అడక్కండి.. చిర్రెత్తిపోయిన రాహుల్ సిప్లిగంజ్

Rahul Sipligunj ABout Baby Hindi Album

బిగ్ బాస్ మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. పునర్నవితో కలిపిన పులిహోర, నిజాయితీ, ముక్కుసూటిదనం, ఉన్నది ఉన్నట్టు చెప్పే గుణం వల్ల చివరకు విజేతగా నిలిచాడు. మొత్తానికి రాహుల్ టైటిల్ గెలిచాక, బయటకు వచ్చాక మరింత పాపులర్ అయ్యాడు. సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ అంటూ ఫుల్ బిజీగా తిరుగుతున్నాడు.

Rahul Sipligunj ABout Baby Hindi Album
Rahul Sipligunj ABout Baby Hindi Album

అయితే రాహుల్ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటాడు. తన ఆల్బమ్స్, తన లైఫ్ స్టైల్‌కు సంబంధించిన అప్డేట్లను పెడుతుంటాడు. ఇక అభిమానులతో ముచ్చటించేందుకు లైవ్‌లోకి వస్తాడు. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తాడు. అయితే ప్రతీ సారి పునర్నవి గురించి అడుగుతుంటారు ఫ్యాన్స్. అలా ఓసారి కాస్త సహనం కోల్పోయి.. ఇంకోసారి ఆమె గురించి అడక్కండని ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

ప్రస్తుతం రాహుల్ బేబీ సాంగ్ ప్రమోషన్స్‌లో ఉన్నాడు. తెలుగు వర్షెన్‌లో వల్గారిటీ ఉందని నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆ బేబీ సాంగ్‌ను హిందీలోనూ రిలీజ్ చేయనున్నాడు. అయితే ఈ బేబీ సాంగ్ ఫుల్ రిచ్‌గా ఉండటంతో అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. వాటన్నంటిపై క్లారిటీ ఇచ్చేందుకు రాహుల్ నేడు లైవ్‌లోకి రాబోతోన్నాడట. అయితే ఈ లైవ్ సెషన్‌లో ప్రతీసారి అడిగే పిచ్చి ప్రశ్నలే అడక్కండి కోరాడు.