బిగ్ బాస్4: 99 శాతం అభిజిత్ గెలుస్తాడు.. రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్ వైరల్

Rahul Sipligunj about Abhijeet winning Bigg Boss Title

రాహుల్ సిప్లిగంజ్ ఈ వారంలో చేసిన రచ్చ మూమూల్ది కాదు. బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లు అరియానా, సోహెల్ గురించి రాహుల్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో అగ్గి రాజేసింది. బిగ్ బాస్ నాల్గో సీజన్ బజ్ హోస్ట్ చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్ షోను బాగానే ఫాలో అవుతుంటాడు. నోయల్ తనకు సన్నిహితుడు, సోదరుడు కాబట్టి అతనికి సపోర్ట్ చేసేశాడు. నోయల్ బయటకు వచ్చాక అభిజిత్‌కు మద్దతు తెలిపాడు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది.

Rahul Sipligunj about Abhijeet winning Bigg Boss Title
Rahul Sipligunj about Abhijeet winning Bigg Boss Title

అయితే నాలుగైదు రోజుల క్రితం రాహుల్ పెట్టిన పోస్ట్ నెట్టింట్లో మంట పెట్టింది. తనకు టాప్ 2లో సోహెల్,అరియానా ఉంటే చూడాలని.. వారే ఉంటారని చెప్పాడు. పర్ఫార్మర్, జెన్యూన్‌గా ఉండేవాళ్లకు సపోర్ట్ చేయండి.. దమ్ముంటే సపోర్ట్ జెన్యూనిటీ, పనికి మాలినోళ్లను బయటకు తోసేయండి అని రాహుల్ పోస్ట్ పెట్టాడు. అభిజిత్‌కు సపోర్ట్ చేసే రాహుల్.. ఒక్కసారిగా ఇలా పోస్ట్ పెట్టడం, పనికి మాలినోళ్లు అంటూ అనడంతో అభిజిత్ ఫ్యాన్స్ రాహుల్‌ను ఓరేంజ్‌లో ట్రోల్స్ చేశారు.

తనపై వస్తోన్న ట్రోలింగ్‌పై రాహుల్ విరుచుకపడ్డాడు. అభిజిత్ ఎలాగూ సేవ్ అవుతాడు.. మిగిలిన వాళ్లకు సపోర్ట్ చేసేందుకే అలా పోస్ట్ పెట్టాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా మరోసారి ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. అభిజిత్ అంటే ఇప్పటికీ ఇష్టమేనని, ఆయన ఎంతో మెచ్యూర్డ్‌గా మాట్లాడతాడని, ఎంతో ఆలోచించి మాట్లాడతాడని రాహుల్ పొగిడాడు. నాకు తెలిసి 99 శాతం అభిజిత్ గెలిచే అవకాశాలే ఉన్నాయని రాహుల్ చెప్పుకొచ్చాడు.