తండ్రి అయినా రాహుల్ రామకృష్ణ…. సంక్రాంతి రిలీజ్ అంటూ కొడుకు పుట్టిన ఆనందంలో కమెడియన్!

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు మాత్రమే కాకుండా సినిమాలో నటించే ఇతర నటీనటులకు డైరెక్టర్లకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా సినిమాలలో కమెడియన్ల పాత్ర చాలా ప్రత్యేకం. సినిమాలలో కమెడియన్లు లేకపోతే ఆ సినిమా అసంపూర్ణంగానే ఉంటుంది. ఇలా ఎంతోమంది కమెడియన్లు తమ కామెడీతో ప్రేక్షకులను నవ్వించి కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్లుగా గుర్తింపు పొందిన వారిలో రాహుల్ రామకృష్ణ కూడా ఒకరు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, జాతి రత్నాలు, భరత్ అనే నేను వంటి ఎన్నో సినిమాలలో నటించి కమెడియన్ గా విలన్ గా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను ఆగట్టుకునే రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు. అయితే సోషల్ మీడియాలో రాహుల్ రామకృష్ణ షేర్ చేసే పోస్టులు కొన్ని సందర్భాలలో వివాదాలకు తావిస్తున్నాయి. ఇలా తాను చేసే పోస్టుల వల్ల తరచూ వివాదాల్లో నిలుస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఇటీవల రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. సంక్రాంతి సందర్భంగా తన అభిమానులకు రాహుల్ రామకృష్ణ శుభవార్త తెలియజేస్తూ పోస్ట్ షేర్ చేశాడు. ప్రేమ వివాహం చేసుకున్న రాహుల్ రామకృష్ణ గతేడాది తాను తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

ఇక తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా తన కొడుకు ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “బాయ్, సంక్రాంతి రిలీజ్ ” అంటూ తనకు బాబు పుట్టిన విషయాన్ని తనదైన శైలిలో తెలియచేశాడు. ఇక ఈ క్రమంలో రాహుల్ రామకృష్ణ అభిమానులు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా రాహుల్ రామకృష్ణ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొత్త సంవత్సరంలో రాహుల్ రామకృష్ణ తండ్రిగా మరొక కొత్త దశలోకి అడుగుపెట్టాడు.