రాఘవేంద్రరావు అంటే తెలుగు సినీ చరిత్రలో ఓ బ్రాండ్. ఆయన అప్పట్లో చరిత్ర సృష్టించిన డైరెక్టర్. కొన్ని ఏళ్ల పాటు తన దర్శకత్వానికి విరామం ఇచ్చిన రాఘవేంద్రరావు.. మళ్లీ తన దర్శకత్వానికి పదును పెడుతున్నారు. తన కొత్త సినిమాను తాజాగా ప్రకటించారు.
పెళ్లి సందడి పేరుతో ఓ సినిమాను తీయనున్నట్టు ఆయన ప్రకటించారు. పెళ్లి సందడి అనే సినిమా ఇదివరకే రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే వచ్చింది. ఇప్పుడు అదే టైటిల్ తో ఆయన మరో సినిమాను ప్రకటించారు. దానికి సంబంధించిన వివరాలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
ఆ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను రూపొందించారు. ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్ సంస్థ నిర్మిస్తోంది. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. చంద్రబోస్ ఈ సినిమాకు సాహిత్యం అందించనున్నారు. అయితే.. ఈ సినిమాలో హీరో, హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని రాఘవేంద్రరావు ట్విట్టర్ లో పేర్కొన్నారు.
అయితే.. ఈ సినిమా టైటిల్ పెళ్లి సందడిలో చివరి అక్షరం డిని మాత్రం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో రూపొందించారు. ఆ అక్షరాన్ని అలా పెట్టడానికి ఉద్దేశం ఏంటో? ఆ అక్షరానికి, సినిమా స్టోరీకి సంబంధం ఏంటో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.
#PelliSandadi…
మళ్ళీ మొదలవ్వబోతుంది….
తారాగణం త్వరలో… pic.twitter.com/fvOqagnhpT— Raghavendra Rao K (@Ragavendraraoba) October 9, 2020