Radhey shyam: ఏప్రిల్ లో ఓటిటి లో రానున్న రాధే శ్యామ్ భారీ మొత్తంకు దక్కించుకున్న అమెజాన్..!

Radhe Shyam:ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా మార్చి 11 న విడుదలయి మంచి స్పందనతో దూసుకుపోతోంది. ప్రభాస్ నటన, పూజ నటన సినిమా విజుల్స్ పై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కొంత మంది సినిమా చాలా నెమ్మదిగా ఉందంటు కామెంట్స్ చేసిన సినిమా కలెక్షన్స్ పై ఆ ప్రభావం పడలేదు.సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీస్ కూడా సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూశారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ గా మారింది.ఈ సినిమా కు సంబంధించిన ఓటిటి హక్కుల కోసం అప్పుడే పలు సంస్థలు పోటీ పడుతున్నాయి అట.

సాధారణంగా ఏ సినిమా అయిన థియేట్రికల్‌ రిలీజ్‌ అనంతరం 4 వారాల తర్వాతే డిజిటల్‌ ప్లాట్‌ఫాంకు వస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైం భారీ ఒప్పందానికి రాధేశ్యామ్‌ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట.

ఏప్రిల్ 11న రాధేశ్యామ్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్‌  అవ్వాల్సి ఉండగా, ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 2న అభిమానుల కోసం ముందుగానే అమెజాన్ ప్రైమ్ వేదికగా రాధేశ్యామ్ స్ట్రీమింగ్‌ చేయనున్నారట. ఏప్రిల్ 2న మధ్యాహ్నం 12 గంటల నుండి రాధేశ్యామ్ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం.