Radhe Shyam: ఓటీటీలో సరికొత్త రికార్డును సృష్టించిన రాధేశ్యామ్!

Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పూజా హెగ్డే జంటగా, రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. బాహుబలి సాహో సినిమా తర్వాత భారీ బడ్జెట్ చిత్రంగా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా గత నెల 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకోగా ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ ను సంపాదించుకుంది. ఇలా థియేటర్లలో విడుదలై ప్లాప్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా విడుదలైన మూడు వారాలకే ఓటీటీలో విడుదల చేశారు.

ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు భారీ స్పందన వచ్చింది. థియేటర్లో ఈ సినిమాని చూడటం మిస్ అయిన ఎంతోమంది ప్రేక్షకులు, అభిమానులు ఓటీటీలో ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది. పుష్ప సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అయిన 8 గంటల
22 నిమిషాలకు 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను నమోదు చేసి రికార్డ్ సృష్టించింది.

అయితే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతూ పుష్ప సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. రాధేశ్యామ్ స్ట్రీమింగ్ అయిన 2 గంటల 5 నిమిషాలకే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబట్టి పుష్ప సినిమా రికార్డు బ్రేక్ చేయడమే కాకుండా సరికొత్త రికార్డును సృష్టించింది. థియేటర్ లో ఎలాంటి గుర్తింపు పొందలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ దక్కించుకుంది.