‘రాధే శ్యామ్’ క్లైమాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ని కంగారు పెడుతుందా ..?

ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ వింటేజ్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘రాధే శ్యామ్’ మోషన్ పోస్టర్ లో రోమియో – జులియేట్.. సలీం – అనార్కలీ.. దేవదాసు – పార్వతీ.. లాంటి అమర ప్రేమికులను చూపించిన దర్శకుడు చివరిగా ‘విక్రమాదిత్య – ప్రేరణ’ల ప్రేమ కావ్యం కూడా ఇలాంటి గొప్ప కథ తోనే తెరకెక్కుతోందని క్లూ ఇచ్చాడు రాధా కృష్ణ .

Always Prabhas Fc ™ on Twitter: "#VikramAditya - Prerana ❤️ 🤩 Thank you  @director_radhaa , @kabilanchelliah , @storyteller_ind 🎉 🤗 👌 #Prabhas  #RadheShyam… https://t.co/Ytf0g3zscj"

ఇక ఈ సినిమా ‘రాధే శ్యామ్’ ముందు నుంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోందని చెబుతూ వస్తున్నారు. కాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు ‘రాధే శ్యామ్’ జ్యోతిష్యానికి సైన్స్ కు మధ్య సాగే బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని మేయిన్ థీమ్ ని రివీల్ చేశాడు. ఇప్పటికే ‘రాధే శ్యామ్’ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ‘విక్రమాదిత్య – ప్రేరణ’ల లుక్స్, బీట్స్ ఆఫ్ ‘రాధే శ్యామ్’ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీగా అంచనాలను పెంచేశాయి.

అంతేకాదు ఈ సినిమాలో బాహుబలి, సాహో సినిమాల మాదిరి యాక్షన్ సీన్స్ ఉండవని చాలా క్లియర్ గా చెపుకొస్తున్నారు. కాని ఇది ఫ్యాన్స్ కి కొంచం డిసప్పాయిన్‌మెంట్ గా ఉంది. కాగా తాజాగా ‘రాధే శ్యామ్’లో యాంటీ క్లైమాక్స్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దాంతో ఇప్పుడు ఈ విషయం ప్రభాస్ ఫ్యాన్స్ ని కంగారు పెడుతుందట.

‘రాధే శ్యామ్’ క్లైమాక్స్ లో హీరో చనిపోతాడట. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ లో కూడా విషాదంతం అయిన ప్రేమికులను చూపించడం కూడా ఇందుకు బలాన్ని చేకూర్చుతోంది. అయితే ఇలాంటి క్లైమాక్స్ తెలుగు ఆడియన్స్ ఒప్పుకోరు. అందుకే దాదాపుగా తెలుగు సినిమాలలో క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్ లోనే ఉంటుంది. కాని ‘రాధే శ్యామ్’ లో ఈ తరహా క్లైమాక్స్ ఉండదని ప్రచారం కావడం ఫ్యాన్స్ తో పాటు కొందరు ప్రేక్షకులను టెన్షన్ పడేలా చేస్తుందట. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో.

Beats Of Radhe Shyam | Prabhas | Pooja Hegde | Radha Krishna Kumar | Happy Birthday Prabhas