రాజ‌మౌళి సెట్ చేసిన రికార్డ్‌ని బ్రేక్ చేసిన రాధేశ్యామ్

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాలు దాటించిన ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. బాహుబ‌లి చిత్రంతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన జ‌క్క‌న్న ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే చిత్రంతో త‌న రికార్డుల‌ను తానే తిర‌గరాయాల‌ని భావిస్తున్నాడు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” అనే చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నాడు. క‌రోనా వ‌ల‌న ఆరు నెల‌లు ఆగిన చిత్ర షూటింగ్ ఇప్పుడు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇండియ‌న్ బాక్సాఫీస్‌పై దండ‌యాత్ర చేసేందుకు సిద్ద‌మ‌వుతున్న ఆర్ఆర్ఆర్ చిత్ర నుండి ఇప్ప‌టి వ‌ర‌కు రెండు టీజ‌ర్స్ విడుద‌ల అయ్యాయి. ఈ రెండు టీజ‌ర్స్ స‌రికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. తాజాగా వ‌చ్చిన ఎన్టీఆర్ టీజ‌ర్ 24 గంటల్లో 4.6 మిలియన్ వ్యూస్ దక్కించుకొని ఆల్ టైం రికార్డు సెట్ చేసింది. దీనిని తాజాగా వచ్చిన బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్(తెలుగు వెర్షన్) 4.7 మిలియన్ వ్యూస్ తో బ్రేక్ చేయ‌డం ఇండ‌స్ట్రీ నాట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇండియాలోనే మోస్ట్ వ్యూడ్ మోషన్ పోస్టర్ టీజర్‌గా రాధేశ్యామ్ కొత్త రికార్డ్ క్రియేట్ చేయ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న “రాధే శ్యామ్” చిత్రం ప్ర‌స్తుతం ఇటలీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ప‌లువురు ప్ర‌ముఖులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. స‌రికొత్త క‌థాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సెట్ చేసిన రికార్డుల‌ని ప్ర‌భాస్ న‌టించిన రాధే శ్యామ్ చిత్రం బ్రేక్ చేయ‌డం ప‌క్కాగా క‌నిపిస్తుంద‌నే ఓ వాద‌న మాత్రం న‌డుస్తుంది. చూడాలి మ‌రి రానున్న రోజుల‌లో ఏ టాలీవుడ్ సినిమా ప్ర‌భంజ‌నం సృష్టిస్తుందో.