రాధే శ్యామ్ ఫస్ట్ గ్లింప్స్ అరాచకం.. విడుదల అయిన 24 గంటల్లో ఎంత పెద్ద రికార్డ్ తెలుసా..?

రాధేశ్యామ్ టీజర్ రిలీజైన కొన్ని గంటల్లోనే ప్రతీ ఒక్కరినీ విపరీతంగా ఆకట్టుకొని ట్రెండింగ్ లో నిలిచింది. డార్లింగ్ ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ కి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న రాధేశ్యామ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. ప్రభాస్ కెరీర్ లో 20 సినిమాగా రాబోతున్న రాధేశ్యామ్ లో కృష్ణంరాజు, భాగ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించబోతుండగా తెలుగు వర్షన్ కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు.

విక్రమాదిత్య – ప్రేరణ ల ప్రేమ కథ కూడా అంతే గొప్పగా ఉంటుందని దర్శకుడు రాధాకృష్ణ బీట్స్ ఆఫ్ రాధే శ్యాం మోషన్ టీజర్ రిలీజ్ చేసినప్పుడే దర్శకుడు రాధాకృష్ణ తెలిపాడు. లైలా – మజ్ఞు, దేవదాసు – పార్వతి, సలీం – అనార్కలీ వంటి అమర ప్రేమికుల కథ లాంటి ప్రేమ కథ నే ప్రభాస్ – పూజా హెగ్డే ల రాధేశ్యామ్ అని తెలుస్తోంది. కాగా తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రాధేశ్యామ్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ని అలాగే సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్.

కాగా రాధేశ్యామ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ ని రాబట్టింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ గ్లింప్స్ తో భారీ రికార్డ్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఇక రాధేశ్యామ్ జూలై 30 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లో ప్రకటించారు. ఇక ప్రభాస్ ఈ ఏడాదిలోనే సలార్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూస్తున్నాడు. ఇప్పటికే సలార్ ఒక షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఈ నెల చివరి వారం నుంచి సెకండ్ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు.