రాశీ ఖన్నా అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు చబ్బీగా, నిండైన బుగ్గలతో ఉండే రాశీ ఖన్నా.. మధ్యలో జీరో సైజులోకి వచ్చింది. ఊహలు గుసగుసలాడే చిత్రంలో ప్రభావతి పాత్రలో రాశీ ఖన్నా సరిగ్గా సరిపోయింది. ఆ తరువాత కాస్త బొద్దుగా తయారైంది. అయినా కూడా ఎంతో ముద్దుగానే ఉంది. లావైందని నెగిటివ్ కామెంట్లు రావడంతో వర్కౌట్లు చేసి సన్నబడింది. ఇంకా వర్కౌట్లు చేస్తూనే ఉంది.
అయితే రాశీ ఖన్నా ఏనాడూ కూడా అందాల ఆరబోతలో హద్దులు దాటలేదు. అది వెండితెర అయినా సరే సోషల్ మీడియా అయినా సరే. చివరగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ అనే ఈ ఒక్క చిత్రమే రాశీ ఖన్నా కెరిర్లో మచ్చగా మారింది. అంతటి బోల్డ్ పాత్ర చేయడంతో రాశీపై అభిమానులు అలిగారు. తప్పు తెలుసుకున్న రాశీ ఖన్నా ఇంకెప్పుడూ అలాంటి పాత్రలు చేయనని చెప్పింది. అభిమానులు మెచ్చే పాత్రలే చేస్తానని పేర్కొంది.
కానీ రాశీ ఖన్నా మాత్రం స్కిన్ షో చేసేందుకు రెడీగా ఉన్నట్టు సిగ్నల్ ఇచ్చింది. మొన్న రాశీ ఖన్నా చేసిన క్లీవేజ్ షో మరిచిపోక ముందే మరోసారి లంగావోణిలో కనిపించి షాకిచ్చింది. జడలో పూలు, లంగావోణి, సిగ్గుపడుతూ నవ్వే ఆ అందమైన ముఖం.. ఆ కొంటె చూపులు ఇలా అన్నీ కలిసి రాశీ ఖన్నాలోని కొత్త యాంగిల్‌ను బయటకు చూపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చిచ్చు పెడుతోంది.