ఊహలు గుసగసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించేసింది అందాల రాశీ ఖన్నా. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో వరుసగా ఆఫర్లు కొట్టేసింది. తక్కువ కాలంలో రాశీ ఖన్నా మంచి పేరు తెచ్చుకున్ని యువ హీరోలందరితోనూ నటించేసింది. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, రామ్, గోపీచంద్, రవితేజ్ ఇలా దాదాపు అందర్నీ కవర్ చేసింది. వరుస హిట్లలో దూసునకుపోతోన్న రాశీ ఖన్నాకు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో పెద్ద దెబ్బ తగిలింది.
వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో రాశీ ఖన్నా అలాంటి సీన్లలో నటించడం ప్రేక్షకులకు నచ్చలేదు. అభిమానులు అలాంటి పాత్రలో ఆమెను చూసి జీర్ణించుకోలేకపోయారు. దీంతో రాశీ ఖన్నా కూడా కాస్త ఫీలైంది. ఇకపై అలాంటి బోల్డ్ పాత్రలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయింది. అయితే ఈ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. నెటిజన్లతో ముచ్చట్లు పెడుతుంది. హీరోలకు కౌంటర్లు వేస్తుంది. వెరైటీ వెరైటీ పోజులు పెడుతుంది.
రాశీ ఖన్నా మంచి గాయని అన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య గిటార్ ప్లే చేసి అద్భుతంగా పాట పాడేసింది. రాశీ టాలెంట్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఇక తాజాగా ఆమె తనలోని మరో కోణాన్ని బయటపెట్టింది. బ్యాక్ మొత్తాన్ని ఫ్రీగా వదిలేసింది. అలా బ్యాక్ నుంచి రాశీని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎంత స్లిమ్‌గా ఎప్పుడైందా? అని అనుకుంటున్నారు. అయితే రాశీ ఈ మధ్య రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తూ జిమ్‌లోనే గడుపుతోంది. ఇలా బ్యాక్ పిక్ షేర్ చేస్తూ నెటిజన్లను క్రాక్ ఎక్కిస్తోంది.