పుష్ప సినిమా సీక్వెల్ గురించి అదిరిపోయే అప్డేట్.. పుష్ప రెండో పార్ట్‌తో ఆగేది కాదు..?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాకి గతేడాది డిసెంబర్ లో దేశవ్యాప్తంగా విడుదలై సంచలనాల సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఊహించని విధంగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ప్రస్తుతం పుష్ప సినిమా సీక్వెల్ పనులలో సుకుమార్ బిజిగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ లో ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా ఇటీవల పుష్ప సినిమా సీక్వెల్ గురించి మరొక వార్త వినిపిస్తోంది.

పుష్ప సినిమాలో భన్వర్‌సింగ్ షెకావత్ పాత్రలో నటించిన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ పుష్ప సీక్వెల్ గురించి గుడ్ న్యూస్ రివీల్ చేశాడు. అయితే గుడ్ న్యూస్ పుష్ప2 గురించి అనుకుంటే పొరబడినట్టే. సాధారణంగా ఎంత గొప్ప సినిమాలు అయిన రెండు పార్ట్లు మాత్రమే ఉంటాయి. కానీ పుష్ప సినిమాకి మాత్రం మూడో సీక్వెల్ కూడా ఉండబోతోంది. మీరు విన్నది అక్షరాల నిజమే. ఈ విషయాన్ని ఫహాద్ ఫాజిల్ స్వయంగా రీవీల్ చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పుష్ప సినిమా రెండో పార్ట్‌తో ఆగేది కాదని, మూడో పార్ట్ కూడా ఉందని కుండబద్దలు కొట్టాడు.

ఈ ఇంటర్వ్యు లో ఫహాద్ ఫాజిల్ మాట్లాడుతూ.. మొదట ఒక పార్ట్ తోనే సినిమా పూర్తి చేయాలనుకున్న సుకుమార్ పోలీస్ స్టేషన్ సీన్ షూట్ చేసిన తర్వాత ఈ సినిమా రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక రీసెంట్‌గా పుష్ప 2 గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, మూడో భాగానికి కూడా సిద్ధంగా ఉండు అని సుకుమార్ చెప్పినట్లు ఆయన వెల్లడించాడు. అయితే ఈ విషయం నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇప్పటికే ప్రేక్షకులు పుష్ప-2 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సౌత్ ఇండియన్ అభిమానులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినీ అభిమానులందరూ పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు పుష్ప-3 అనే వార్త తెలియడంతో.. సినీ ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.