Pushpa Movie: బుల్లితెర ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైన పుష్ప.. త్వరలోనే ప్రసారం?

Pushpa Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీ దేశ వ్యాప్తంగా విడుదల ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. అప్పటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏమాత్రం మార్కెట్ లేని అల్లు అర్జున్ కు ఈ సినిమా అమాంతం క్రేజ్ తీసుకు వచ్చిందని చెప్పాలి. బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏకంగా వంద కోట్లను కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది.

ఈ విధంగా థియేటర్లు ఎంతో మంచి క్రేజ్ దక్కించుకుని ప్రేక్షకులను పుష్పరాజ్ విడుదల మరోసారి ప్రేక్షకులను సందడి చేసింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతూ విశేషమైన ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా త్వరలోనే బుల్లితెరపై ప్రసారం కానుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన పుష్ప సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే వరల్డ్ ప్రీమియర్ గా ఈ సినిమా స్టార్ మాలో ప్రసారం కాబోతుంది.

ఇలా థియేటర్, అమెజాన్ ద్వారా ప్రసారం అయ్యి ప్రేక్షకులను సందడి చేసిన ఈ సినిమా బుల్లి తెరపై ఏ విధంగా ప్రేక్షకులను సందడి చేయనుందో తెలియాల్సి ఉంది.ఇక ప్రస్తుతం ఈ సినిమా రెండవ పాట చిత్రీకరణ కోసం చిత్రబృందం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సినిమా రెండవ భాగం చిత్రీకరణ జరుపుకోనుంది.ఇక రెండవ పాట చిత్రీకరణ పై డైరెక్టర్ సుకుమార్ మరింత శ్రద్ధ చూపుతున్నట్లు సమాచారం ఇక ఈ సినిమాను ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలలోని చిత్రీకరణ చేయాలని భావిస్తున్నారు.