Pushpa Movie Update: పుష్ప పార్ట్-2 ఎప్పుడంటే..

Pushpa Movie Update: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన ‘పుష్ప’ బాక్సఫీసు దగ్గర కలెక్షన్స్ తో బెంబోలిస్తుంది. బొమ్మ ఏ థియేటర్లో ఆడినా ‘తగ్గేదేలే’ అంటూ కలెక్షన్లు రాబడుతుంది. భాషా బేధం లేకుండా.. టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా దేశంలో ఉన్న సినీ ప్రియులందరికీ పూనకాలు తెప్పిస్తుంది పుష్ప చిత్రం. ముందు డివైడ్ టాక్ అందుకున్నా.. ఆ తర్వాత మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో ముందుకు దూసుకుపోతుంది.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ పాన్ ఇండియా మూవీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17న విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చిన ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, సునీల్, ఫహాద్ ఫాసిల్, అజయ్ గోష్, తదిరులు కీలక పాత్రలు పోషించారు.

అయితే ఈ సినిమా పార్ట్ 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో మొదలు పెడతామని అని సుకుమార్ తెలిపారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది దసరా లేదా క్రిస్మస్ సమయంలో విడుదలకి సిద్ధం అవుతుందని వెల్లడించారు. మొదటి భాగం పుష్ప హిట్ కావడంతో ‘పుష్ప ది రూల్’ పైన భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి.