Pushpa Actor: గొప్ప మనసు చాటుకున్న పుష్ప నటుడు జాలిరెడ్డి… స్వగ్రామంలోనే శ్రీకారం?

Pushpa Actor: అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో జాలి రెడ్డి పాత్ర ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుందని చెప్పాలి. ఈ జాలి రెడ్డి పాత్రలో నటించిన నటుడు డాలీ ధనంజయ్ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ మధ్యనే సత్యదేవ్ హీరోగా నటించిన జీబ్రా సినిమాలో కూడా ఈయన కీలక పాత్రలో నటించే ప్రేక్షకులను మెప్పించారు. ఇక సినిమాల సంగతి పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఇటీవల ధనుంజయ్ నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే.

ధనుంజయ్ ధన్యత అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఈ నెలలోనే మైసూరు వేదికగా వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇటీవల వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయనకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ధనుంజయ్ పెళ్లికి ముందే తన స్వగ్రామంలో ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టారని తెలుస్తోంది.

తన స్వగ్రామమైనటువంటి హుత్తురులో ఉన్నఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల బాగా శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని గమనించిన డాలీ ధనంజయ్ స్కూల్ మొత్తానికి కొత్త రూపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇలా స్కూల్ ప్రహరీ గోడ సీలింగ్ ఫ్లోర్ మొత్తం స్థితులావస్థకు చేరుకోవడంతో తన సొంత ఖర్చులతో పాఠశాల రూపురేఖలను పూర్తిగా మార్చబోతున్నారు.

శిథిలావస్థకు చేరిన ఫ్లోర్ కవరింగ్ తొలగించి కొత్త టైల్స్ వేస్తున్నారు. అలాగే ఉపాధ్యాయుల గదులను మరమ్మతులు చేయిస్తున్నాడు. గేట్ రిపేర్, కాంపౌండ్ రిపేర్, స్కూల్ మొత్తానికి పెయింటింగ్ వేయడం, మరుగుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛమైన తాగునీటి కోసం కొత్త వాటర్ ఫిల్టర్, అన్ని వసతులతో కూడిన వంటగదినీ కూడా ఏర్పాటు చేయించబోతున్నారు అయితే ఈ మరమ్మత్తులన్నీ కూడా తన సొంత డబ్బుతోనే చేయించబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు సినిమాలో మనుషుల పట్ల జాలి లేకుండా నటించిన జాలిరెడ్డి నిజజీవితంలో మాత్రం ఎంతో గొప్ప మనసు చాటుకున్నారు అంటు కామెంట్లు చేస్తున్నారు.