పుష్ప 3 సినిమా కన్ఫామ్.. ఇదిగో ఆధారాలు!

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పుష్ప 2 ది రూల్ ఈరోజే గ్రాండ్ గా రిలీజ్ అవటంతో థియేటర్లలో సందడి నెలకొంది. పుష్ప 1 జరుగుతున్నంత సేపు పుష్ప 2 మీద ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు ఆ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఇక అందరి దృష్టి పుష్ప 3 మీద పడింది. ఈ సినిమా ఉంటుందని కొందరు ఉండదని కొందరు ఊహగానాలు చేస్తున్నారు. మూవీ టీం వారు ఉంది అన్నట్లు లేదు అన్నట్లు క్లారిటీ లేకుండా స్టేట్మెంట్లు ఇస్తున్నారు.

అయితే పుష్ప 3 సినిమా ఉంది అని కన్ఫామ్ అయిన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అది ఏమిటంటే ఈ సినిమాలో సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రసూల్ పోకుట్టి ఈ మధ్యన ఆయన టీం తో కలిసి దిగిన ఫోటో వెనుక పుష్ప 3 టైటిల్ ఉంది ఇందులో పుష్ప 3 ర్యాంపేజ్ అని ఉండటంతో పార్ట్ టు చివరిలో మూడో భాగానికి సంబంధించిన హింట్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.అంతేకాదు మొన్న హైదరాబాదులో జరిగిన ఈవెంట్ లో కూడా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ నేను మీ హీరోని మూడేళ్లు కష్టపెట్టాను. మీరు మీ హీరో అల్లు అర్జున్ ని అడగండి.

నేను నా ఫ్రెండ్‌ అల్లు అర్జున్ ని అడుగతాను. నా కోసం మళ్లీ మరో మూడేళ్లు ఇస్తే తప్పకుండా ‘పుష్ప 3’ చేస్తా’ అని చెప్పుకొచ్చాడు.అంతేకాకుండా మొన్న బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్‌ స్పందిస్తూ పుష్ప 2 కి కంటిన్యూషన్ ఉంటుందని తెలిపారు. ‘పుష్ప2’ క్లైమాక్స్‌లో ‘పార్ట్‌-3’కి లీడ్‌ ఇస్తూ కొన్ని సన్నివేశాలను చూపించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఇప్పుడప్పుడే వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

ఎందుకంటే అల్లు అర్జున్ తన తర్వాత ప్రాజెక్ట్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కమిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కోలీవుడ్ దర్శకుడు అట్లీతో కూడా కమిట్మెంట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సుకుమార్ తను నెక్స్ట్ ప్రాజెక్ట్ చరణ్ తో చేయబోతున్నట్లు సమాచారం. కాబట్టి ఈ ప్రాజెక్టులు అన్నీ కంప్లీట్ అవ్వటానికి కనీసం రెండు మూడు సంవత్సరాల సమయం పడుతుంది. పుష్ప 3 కావాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.