ఇలాగైతే “పుష్ప 2” 1000 కోట్ల బిజినెస్ నిజమే.!

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ దగ్గర భారీ క్రేజ్ ఉన్నటువంటి పలు చిత్రాల్లో మన టాలీవుడ్ నుంచే అధికంగా ఉండగా ఈ లిస్ట్ లో పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న బిగ్గెస్ట్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కూడా ఒకటి.

మరి ఈ భారీ సినిమా మొన్న వచ్చిన గ్లింప్స్ తో ఎనలేని హైప్ ని సెట్ చేసుకోగా అంతకు ముందు నుంచే అయితే ఈ సినిమాకి ఏకంగా 1000 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని కొన్ని రూమర్స్ ఉన్నాయి. అయితే ఇది దాదాపు నిజమే అనిపిస్తుంది.

లేటెస్ట్ గా ఓ సెన్సేషనల్ రూమర్ పుష్ప 2 పై వైరల్ గా మారుతుంది. మరి ఈ సినిమా జస్ట్ ఆడియో హక్కులు మాత్రమే ఇండియన్ వైడ్ గా ఏకంగా 65 కోట్లు పలికాయని అంటున్నారు. అయితే ఇది ఇండియన్ సినిమా దగ్గరే బిగ్గెస్ట్ రికార్డు కాగా ఆర్ ఆర్ ఆర్, బాహుబలి 2, సాహో లాంటి సినిమాలు కలిపితే పుష్ప 2 కి వచ్చింది.

అంటే ఎంత పెద్ద ఆఫర్ అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియరాలేదు కానీ ఒకవేళ నిజం అయితే జస్ట్ ఆడియో హక్కులకే ఇంత మొత్తంలో అయితే ఇక థియేట్రికల్ బిజినెస్, శాటిలైట్, ఓటిటి హక్కులు కలిపితే 1000 కోట్లు బిజినెస్ అయ్యినా కూడా ఆశ్చర్యం లేదని చెప్పాలి.

మరి ఈ టాక్ నిజమా లేక్ బన్నీ పి ఆర్ టీం జిమ్మిక్ మాత్రమేనా అనేవి తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాని అయితే దర్శకుడు సుకుమార్ మొత్తం మూడు పార్ట్స్ గా ప్లాన్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమా గ్లోబల్ రిలీజ్ ఉండనున్నట్టుగా తెలుస్తుంది.