అల్లు ఆర్మీ.. గేట్ రెడీ!

పుష్ప.. పుష్ప రాజ్.. తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసును బద్ధలు చేసింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా సుకుమార్ తెరకెక్కింకించిన ఈ సినిమా.. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. తగ్గేదే లే డైలాగ్ తో పాటు రారా సామి పాట విపరీతమైన క్రేజ్ ను అందుకుంది. దీనికి సీక్వెల్ అయిన్ పుష్ప-2 షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే.

అయితే పుష్ప-2 లో కూడా అల్లు అర్జున్, రష్మికా మందన్నాలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఏప్రిల్ 8వ తేదీన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ఓ అదిరిపోయే గిప్టును ఇచ్చేందుకు సిద్ధం అయింది. పుష్ప2: ది రూల్ కు సంబంధించిన టీజర్ ను బన్నీ బర్త్ డే రోజున రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 8 తేదీన మూడు నిమిషాల నిడివి ఉండే యాక్షన్ టీజర్ ను విడుదల చేయబోతుందట. ఇందుకు సంబంధించిన టీజర్ ను ఇప్పిటికే పూర్తి చేయగా.. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది.

పుష్ప కంటే పుష్ప 2 మరింత బాగుంటుందని చాలా మంది భావిస్తున్నారు. సాంగ్స్, డైలాగ్స్ తో సుకుమార్ మరోసారి సూపర్ డూపర్ హిట్టు కొడతారని అంచనా వేస్తున్నారు. పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ దృష్టిలో ఉంచుకొని పుష్ప 2 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట చిత్రబృందం. కేవలం ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ ను కూడా దృష్టిలో పెట్టుకొని 2024 వేసవిలో సినిమాను విడుదల చేయాలని భావిస్తోందట. రష్యాలో కూడా పుష్ప2 ను విడుదల చేసేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది.

ఈ సినిమాను వచ్చే ఏడాది అంటే 2024 వేసవిలో రిలీజ్ కు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండియాతో పాటు అమెరికా, రష్యా వంటి దేశాల్లో కూడా పుష్ప భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించింది. దేశ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయలు వసూలు చేస్తే.. కేవలం హిందీలోనే 100 కోట్ల రూపాయలను సంపాదించింది. మరి పుష్ప-2 ఏ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేయబోతుందో తెలియాలంటే ఇంకో ఏడాది ఆగాల్సిందే.