మొత్తానికి అల్లు అర్జున్ అభిమానుల మూడు సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ గా దూసుకుపోతుంది పుష్ప 2 మూవీ. ఇన్నాళ్లు సినిమా ఎప్పుడు వస్తుంది, సినిమా అప్డేట్ ఏంటి, సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ ఎక్కడ అంటూ తెగ ఆత్రుత ప్రదర్శించిన ప్రేక్షకులు ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ ఏ ప్లాట్ ఫారం లో రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు.
అయితే అత్యంత ప్రజాధరణ పొందుతున్న ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ ఏ ప్లాట్ ఫామ్ సొంతం చేసుకుంది, ఎంతకి కొనుగోలు చేసింది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. పుష్ప 2 సినిమా డిజిటల్ రైట్స్ కోసం ఓటిటి ఫ్లాట్ ఫార్మ్స్ గట్టిగానే పోటీ పడ్డాయట. ఈ పోటీలో అమెజాన్ చివరి వరకు పోటీపడినా భారీ మొత్తాన్ని చెల్లించి నెట్ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రైట్స్ ని 275 కోట్లకు నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
గతంలో పుష్ప 1 మూవీని అమెజాన్ కేవలం 30 కోట్లకు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. భారతీయ సినిమా చరిత్రలోనే ఇప్పటివరకు ఏ సినిమాకి లేనంతగా ఏకంగా 270 కోట్లకు నెట్ఫ్లిక్స్ సంస్థ పుష్ప 2 డిజిటల్ రేట్స్ ని దక్కించుకుందంట. ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే పుష్ప 2 ఓటిటి రిలీజ్ విషయానికి వస్తే ఓటిటి రూల్స్ ప్రకారం సినిమా విడుదలైన ఐదు వారాల తరువాత కి స్ట్రీమింగ్ అవుతుంది.
అంటే జనవరి 10న సంక్రాంతి సందర్భంగా నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ జరుగుతుంది. అయితే అలాంటిదేమీ లేదని జనవరి 25 కి స్ట్రీమింగ్ అవుతుందని బాలీవుడ్ మీడియా అంటుంది. 50 రోజులు ఈవెంట్ చేసిన తర్వాత ఓటీటి స్ట్రీమింగ్ చేయడానికి నిర్మాతలు ఒప్పుకున్నట్లు సినీవర్గాల సమాచారం. అయితే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది అఫీషియల్ గా తెలియాల్సిందే.