ఆ సీన్లు ఏమయ్యాయి.. పుష్ప 2 కథ మొత్తం మార్చేశారా!

ఎట్టకేలకు మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ పుష్ప 2 మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ముందుగా ఊహించినట్లుగా ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సినిమాలో కధ కొత్తగా లేదు కానీ కథనం మాత్రం చాలా కొత్తగా ఉంది. హీరో స్థాయికి తగ్గట్టు ఎలివేషన్స్ భారీ యాక్షన్స్ సీన్స్ మంచి పాటలు దీనికి తోడు సుకుమార్ మేకింగ్ స్టైల్ అన్నీ కలిపి సినిమాని ఒక రేంజ్ లో నిలబెట్టాయి.

అయితే గతంలో పుష్ప 2 సినిమాకి సంబంధించిన వేర్ ఇస్ పుష్ప అంటూ వచ్చిన టీజర్ లో ఉన్న సీన్స్ సినిమాలో ఎక్కడా కనిపించడం లేదు అంటున్నారు ప్రేక్షకులు. ఆ టీజర్ లో పుష్ప జైలు నుంచి తప్పించుకున్నట్టు, అతనికి బుల్లెట్ దెబ్బలు తగిలినట్లు, అతని కోసం పోలీసులు వెతుకుతున్నట్టు చూపించారు. అలాగే అతను సంపాదించిన సొమ్ముని పది మందికి పంచుతున్నట్లు కూడా చూపించారు. అయితే ఈ సీన్లు ఏవి సినిమాలో లేవు.

పుష్ప పోలీసులకి దడ పుట్టించాడే గాని ఎక్కడా పోలీసులు పుష్ప ని పట్టుకొని జైల్లో పెట్టినట్లు లేవు. అప్పట్లో టీజర్ విడుదలైనప్పుడు కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని కథ మొత్తాన్ని మార్చేసారా అనుకుంటున్నారు ప్రేక్షకులు. అయితే సినిమాలో జాతర ఎపిసోడ్ హైలెట్ అని ఆ సీన్ సుకుమార్ గొప్పగా తీసాడని అనుకుంటున్నారు. అలాగే క్లైమాక్స్ కి ముందు వచ్చే యాక్షన్ సీన్ అయితే పునకాలు కూడా తెప్పిస్తుందని అంటున్నారు.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సుకుమార్ ఫుల్ మీల్స్ పెట్టాడనే చెప్పవచ్చు. ప్రతి సీన్ చాలా బాగా,వాస్తవాన్ని ప్రతిపాదించేలా చూపించాడు కానీ ముందుగా టీజర్ లో చూపించిన సన్నివేశాలు ఎందుకు పెట్టలేదు, ఈ సీన్స్ పుష్ప 3 లో ఉండబోతున్నాయా, సినిమాలో సీన్స్ పెట్టలేనప్పుడు టీజర్ లో చూపించడం ఎందుకు అని పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. మరి దీనిపై మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.