పుష్ప 2 సినిమా 6 భాషల్లో 12 వేల స్క్రీన్స్ లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే రికార్డులు బద్దలు కొట్టేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో పుష్ప 2 సినిమా కేజిఎఫ్ 2, బాహుబలి 2,కల్కి 2898 సినిమాలు రికార్డుని బ్రేక్ చేసింది. బుక్ మై షో లో అత్యంత వేగంగా మిలియన్ టిక్కెట్లు అమ్ముడైన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
పుష్ప ది రూల్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన తర్వాత తొలి రోజు కోసమే 3 లక్షల టికెట్లు ఈ బుక్ మై షో ద్వారా అమ్ముడవటం విశేషం. ఇప్పటికే కేవలం అమెరికాలోనే రెండు మిలియన్ డాలర్ల పైనే కలెక్ట్ చేసింది ఈ సినిమా. తాజాగా ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమా రిలీజ్ కి ముందే ఏకంగా 100 కోట్లు రావడంతో సరికొత్త రికార్డు సెట్ చేసినట్లు అయింది.
ఈ సినిమాలోని డైలాగులు, పాటలు అల్లు అర్జున్ యాక్షన్ అన్ని యువతని అట్రాక్ట్ చేయడంలో బాగా సక్సెస్ అయింది మూవీ టీం. అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా కాకపోయినా కూడా ఈ సినిమా గురించి ఒక లెవెల్ లో చర్చించుకుంటున్నారంటే సినిమా ఏ లెవెల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా హైయెస్ట్ టిక్కెట్ రేట్స్ తో రిలీజ్ అవ్వటం ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ లో దూసుకుపోతుంది.
అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటివరకు 6.6 లక్షల టికెట్లు అమ్ముడు అవ్వటం అనేది మామూలు విషయం కాదు. అలాగే ఉత్తర అమెరికాలోనే ఇప్పటివరకు 16 కోట్ల టికెట్లు అడ్వాన్స్గా బుక్ అయ్యాయి. అంతేకాదు ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటికే 50 వేల టికెట్స్ అమ్ముడైపోయాయి.ఈ కల్ట్ మానియాకు పుష్ప 2 పై ఎక్స్పెర్టేషన్ ఆకాశాన్ని దాటేస్తున్నాయి. ఇక రిలీజ్ తర్వాత ఈ సినిమా మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
#Pushpa2TheRule crosses the 100 CRORES mark with advance bookings 💥💥💥
THE BIGGEST INDIAN FILM is on a record breaking spree ❤🔥#RecordsRapaRapAA 🔥🔥#Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/vTBhiy18oB
— Pushpa (@PushpaMovie) December 3, 2024