ఆ మాడ్యులేషన్ కోసం నోట్లో కాటన్ పెట్టుకున్నా.. పుష్ప 2 డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రేయస్ కామెంట్స్!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా పుష్ప 2 మొదటి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించింది అని మూవీ టీం అధికారికంగా తెలియజేసింది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా కలెక్షన్స్ దుమ్ము లేపుతుంది. ఇక ఈ సినిమాలోని అల్లు అర్జున్ పాత్రకి హిందీలో డబ్బింగ్ చెప్పిన నటుడు శ్రేయాస్ తల్పాడే డబ్బింగ్ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే.

పుష్ప 1 కి కూడా ఈయనే చెప్పారు. అయితే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పుష్ప 2 సినిమాకి తాను ఏ విధంగా డబ్బింగ్ చెప్పింది చెప్పుకొచ్చారు. పుష్ప 1 సినిమాకి డబ్బింగ్ చెప్పేటప్పుడు కంటే పుష్పట్టు సినిమాకి డబ్బింగ్ చెప్పటానికి ఎక్కువ సమయం తీసుకున్నాను. ఈ సినిమాకి రెండు గంటల చొప్పున 14 షెషన్స్ చేశాను. పుష్ప సీక్వెల్ లో పుష్పరాజ్ పాత్ర మరింత గంభీరంగా ఉన్నందువలన పుష్ప యొక్క దూకుడు సూక్ష్మ భావోద్వేగాలకు సరిపోయేలా శ్రేయస్ తన వాయిస్ ని మాడ్యులేట్ చేయాల్సి వచ్చింది.

అందుకే తాను ప్రత్యేకమైన ట్రిక్ ని ఫాలో అయ్యానని చెప్పాడు శ్రేయష్. పుష్పరాజ్ పాత్రకు కఠినమైన టోన్ తీసుకురావడానికి అతను నోటిలో పత్తిని ఉంచుకొని డబ్బింగ్ చెప్పినట్లు చెప్పాడు. ఈసారి పాత్రలో మరింత హుందాతనం ఉంది, మొదటి పార్ట్ లో కంటే ఈ సినిమాలో అతను మరింత ఆత్మ విశ్వాసంతో కనిపిస్తాడు.అంతేకాకుండా అతని బాడీ లాంగ్వేజ్ కూడా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తాడు.

తాగటం, పొగాకు నమలటం లేదంటే కొన్నిసార్లు దూమపానం చేయటం కూడా చేస్తాడు. వీటన్నింటికి నార్మల్గా డబ్బింగ్ చెప్పటం అంత సులువు కాదు అందుకే అలాంటప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పుడు నా నోటిలో దూది పెట్టుకున్నాను అని చెప్పాడు. అలాగే సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ ని తాను ఎప్పుడూ కలవలేదని ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పే అవకాశం తనకు ఇచ్చినందుకు ఆ మూవీ యూనిట్ కి కృతజ్ఞతలు కూడా చెప్పాడు.