ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. బుధవారం రాత్రి 9:30 గంటలకు ఈ సినిమా ప్రీమియర్ షో ప్రదర్శితమైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా సినిమా చూడటానికి వచ్చాడని తెలుసుకున్న అభిమానులు ఒక్కసారిగా పోటేట్టడంతో తీవ్ర తొక్కిసలాట ఏర్పడింది. ఈ తొక్కిసలాటలో దిల్షుక్ నగర్ కు చెందిన రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు కింద పడి జనాల కాళ్ళ మధ్య నలిగిపోయి అపస్మాకస్థితికి చేరుకున్నారు.
అయితే పోలీసులు వెంటనే వారిద్దరిని పక్కకు తీసుకువెళ్లి సిపిఆర్ చేసి తర్వాత పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళగా తల్లి అప్పటికే మృతి చెందిందని కుమారుడు పరిస్థితి విషమంగా పొందని డాక్టర్లు చెప్పారు. అయితే ఈ ఘటనపై పుష్ప 2 టీం స్పందించింది. ఇలా జరగడం దురదృష్ట ఘటన అని బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం అని మూవీ టీం హామీ ఇచ్చింది.
అయితే ఆ కుటుంబానికి సంబంధించిన మరింత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ పరిస్థితి అప్పుడే చెప్పలేమని, అతనికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని, మరొక 78 గంటలు దాటితేనే గానీ అతని ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని డాక్టర్లు చెప్పటంతో ఆ కుటుంబం లో మరింత విషాద ఛాయలు అలుముకున్నాయి. సరదాగా సినిమాకి వస్తే ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగా దురదృష్టకరం.
ఈ సందర్భంగా రేవతి భర్త భాస్కర్ మాట్లాడుతూ సినిమా చూద్దాం అని బాబు అడగటంతోనే సినిమాకి వచ్చామని, బాబు కోసం వచ్చి నా భార్యని కోల్పోవడం తట్టుకోలేకపోతున్నానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. థియేటర్ వద్ద సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యం వహించిన సంధ్య టాకీస్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రేవతి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.