విలన్లతో కలిసిపోయిన సుమ.. ల్యాండ్ సెంటిల్‌మెంట్‌లో రచ్చ!

యాంకర్ సుమ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. సుమకు బుల్లితెర అయినా, ప్రైవేట్ ఈవెంట్లైనా, సోషల్ మీడియా అయినా సరే సుమ ధాటికి ఎవ్వరూ నిలబడలేరు. ఆ విషయం మరోసారి నిరూపితమైంది. టాలీవుడ్ సీనియర్ విలన్లను సుమ ఓ ఆట ఆడుకుంది. క్యాష్ షోలో నలుగురు విలన్లను సుమ గెస్ట్‌లు పట్టుకొస్తే అక్కడ పంచ్‌ల ప్రవాహాం ఉరకలెత్తింది. అయితే సుమను కూడా వారు ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.

తమ విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టిన అజయ్‌రత్నం, సత్యప్రకాష్‌, పృథ్వీరాజ్‌, తోటపల్లి మధులు ఈ సారి షోలో పాల్గొని సందడి చేశారు. ఈ శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా ఎంట్రీలోనే పృథ్వీ ‘మైండ్‌ బ్లాకు’ సాంగ్‌కు చేసిన డాన్స్‌ హుషారెత్తించింది. ఒక్కసారిగా షర్ట్ విప్పడంతో అందరూ షాక్ అయ్యారు. సుమ దెబ్బకు అవాక్కయి సెటైర్ వేసింది. నిజంగానే చివర్లో మైండ్ బ్లాక్ చేసేశావ్ అంటూ కౌంటర్ వేసింది.

Purthvi and Sathya Prakash In Anchor Suma Cash show
Purthvi and Sathya Prakash In Anchor Suma Cash show

పృథ్వీ రెమ్యునరేషన్‌ గురించి, సత్యప్రకాష్‌ యాంకరింగ్‌ చేస్తాననటంపై తోటపల్లి మధు వేసిన పంచ్‌లు బాగా పేలాయి. సుమ ఇచ్చే కౌంటర్లకు సత్యప్రకాష్‌ కన్ఫ్యూజన్‌తో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్లు తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే ల్యాండ్‌ సెటిల్మెంట్‌ అంటూ బాస్కెట్ బాల్ రౌండ్‌లో సుమ విలన్లను ఆటాడించింది. ఇందులో సత్య ప్రకాష్‌, తోటపల్లి మధును ఇరుకున పెట్టించే ప్రశ్నలను వేసి వారిని సుమ ఉక్కిరిబిక్కిరి చేసేసింది.

Cash Latest Promo - 19th December 2020 - Satya Prakash,Ajay Ratnam,Thotapalli Madhu,Prudhvi Raj