Vijay Devarakonda: త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న పూరి జన గణ మన!

Vijay Devarakonda: ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి విషయాలను అందుకుని ప్రస్తుతం స్థాయిలో హీరోగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో స్థాయిలో లైగర్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత పూరీ జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.

పూరీ జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమాను నటుడు విజయ్ దేవరకొండతో చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయితే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ లైగర్ ముంబై షూటింగ్ లో బిజీగా ఉంది.ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత మరో సినిమాకు సిద్ధం అవుతున్నారు.ఈ క్రమంలోనే జనగణమన సినిమా పనులు కూడా మరోవైపు శరవేగంగా జరుగుతున్నాయి ఈ క్రమంలోనే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

జనగణమన సినిమా షూటింగ్ ఏప్రిల్ నెలలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దక్షిణ ఆఫ్రికాలో ఈ సినిమా షెడ్యూల్ ను ప్లాన్ చేసారు. విజయ్ ఏప్రిల్ లో షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ను అనుకుంటున్నట్టు సమాచారం.పూరీజగన్నాథ్, విజయ్ దేవరకొండ కలయికలో రాబోతున్న రెండో చిత్రం. ఇక లైగర్ సినిమాను ఆగష్టు 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.