దర్శకుడు పూరీ జగన్నాథ్ సోషల్ మీడియాలో ఫిలాసఫీ పేరిట పాడ్ కాస్ట్లు చేస్తాడన్న సంగతి తెలిసిందే. పూరి మ్యూజింగ్స్ అనే పేరుతో తన అభిప్రాయాలని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ విషయాలు మనకి తెలిసినవే అయినా కూడా పూరి చెప్పే విధానం మనకి కనెక్ట్ అవుతుంది, అతను చెప్పింది నిజమే కదా అనిపిస్తుంది. గతవారం కన్జ్యూమింగ్ అనే అంశంపై మాట్లాడిన పూరి జగన్నాథ్ తాజాగా కొత్త ఫిలాసఫీతో ముందుకు వచ్చాడు ఈ వారం స్లో లైఫ్ అంటూ స్లో లైఫ్ లీడింగ్ యొక్క ప్రాముఖ్యతను చెప్పాడు.
స్లో లైఫ్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ ఫిలాసఫీ దట్ ప్రమోట్ క్వాలిటీ ఓవర్ క్వానిటీ, స్లోయింగ్ డౌన్ యువర్ వర్క్. ప్రతిరోజు మనకి డెడ్ లైన్స్ ఉంటాయి ప్రస్తుతం ప్రపంచంలో మనమందరం పరుగులు పెడుతూ బ్రతుకుతున్నాము, ఊపిరి ఆడకుండా పరిగెడుతున్నాం మన డైలీ లైఫ్ స్పీడ్ తగ్గించే బ్రతకడం నేర్చుకోవాలి. ఉదయాన్నే మంచం మీద నుంచి ఉలిక్కిపడి లేవడం, మంచం మీద నుంచి బాత్రూంలోకి దూరడం, ఆ తరువాత వీధిలోకి పరిగెత్తడం కాదు జీవితం అంటే.
మెల్లగా లేచి కాలకృత్యాలు తీర్చుకొని వీలైతే ఒక గంట యోగ చేసి టైం తీసుకుని మెల్లగా బ్రేక్ ఫాస్ట్ చేసి బయలుదేరటం మంచిది. ఇది బద్ధకంగా ఉండమని చెప్పటం కోసం కాదు ప్రతి పనికి దానికి ఇవ్వాల్సిన టైం దానికి ఇస్తే ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేయవచ్చు. 10 సెకండ్లలో బ్రష్ చేసి రెండు నిమిషాల్లో స్నానం చేయటం, కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోవటం మానేయాలి. లైఫ్ స్లో చేయటం వల్ల మీ కాన్వర్జేషన్స్ బెటర్ అవుతాయి.
మీ రిలేషన్స్ బెటర్ అవుతాయి, మీ ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు కాసేపైనా ప్రశాంతంగా కూర్చోగలిగితే ఒకరికొకరు అర్థం అవుతారు లేకపోతే మీ ఇంట్లో అందరికీ మీరు సస్పెన్స్ గా తయారవుతారు. వంట చేయడానికి తినటానికి కాస్త టైం ఇవ్వండి. కాసేపు కుక్కతో ఆడుకోండి, కాసేపు సైక్లింగ్ చేయండి.ఇవన్నీ మనం చేయగలమా అని అనుకోవచ్చు కానీ మీరు గంట లేదా రెండు గంటల ముందు లేవగలిగితే ఇవన్నీ చేయవచ్చు అని చెప్పుకొచ్చాడు పూరి జగన్నాథ్.