ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించిన పూరి జగన్నాథ్.. ఆ ఇద్దరి వల్లే అంటూ కంప్లైంట్?

Puri Jagannadh to approach Pawan Kalyan

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన పూరి జగన్నాథ్ గురించి తెలియని వారంటూ ఉండదు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమాలలో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ మరికొన్ని డిజాస్టర్ గా మిగిలాయి. ఇలా హిట్, ప్లాఫ్ లతో సంబంధం లేకుండా పూరి జగన్నాథ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన విడుదలే అందరి అంచనాలు తారుమారు చేస్తూ డిజాస్టర్ గా మిగిలింది.

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందించిన ఈ సినిమా ఇలా డిజాస్టర్ గా మిగలటంతో ఈ సినిమా నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా నష్టపోయారు. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్ లో తమ డబ్బు తిరిగి చెల్లించమని పూరి జగన్నాథ్ మీద ఒత్తిడి చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో పూరి జగన్నాథ్ తనకు ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీరిద్దరూ డబ్బుల విషయంలో తనని, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని, వారి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ‘లైగర్’ సినిమా వల్ల నష్టపోయిన బాధితులంతా ఈ నెల 27న తన ఇంటి ముందు ధర్నా చేసి తన పరువు తీయటానికి కుట్ర చేస్తున్నారని పూరీ పోలీసులకు వెల్లడించాడు. నష్టపోయిన డబ్బు తిరిగి చెల్లిస్తానని చెప్పినా బెదిరింపులకు పాల్పడ్డారని పూరీ ఆరోపించారు. డిస్ట్రిబ్యూటర్లు తన ఇంటిపై దాడి చేస్తారన్న అనుమానంతో ముందస్తుగా రక్షణ కల్పించాలని పూరి జగన్నాథ్ పోలీసులను ఆశ్రయించాడు.