అడుక్కునే వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వడానికి బాగుంటాయి.. జాకెంట్ గురించి పూరి జగన్నాథ్ కామెంట్స్!

పూరి జగన్నాథ్ ఒకప్పుడు ఇండస్ట్రీకి తిరుగులేని హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్. తర్వాత మెల్లమెల్లగా అతని కెరియర్ డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. అతను చివరిగా తీసిన డబల్ ఇస్మార్ట్ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమాని సినీ హీరోయిన్ ఛార్మితో కలిపి నిర్మించాడు పూరీ జగన్నాథ్. ప్రస్తుతం కొత్త సినిమాలు ఏవి చేయడం లేని పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో పూరి మ్యూజింగ్స్ పేరుతో యూట్యూబ్లో తన ఆలోచనలను షేర్ చేసుకుంటూ ఉంటాడు.

వచ్చిన ప్రతిసారి సరికొత్త టాపిక్ ని మనం ముందుకి తీసుకు వస్తాడు. అలాగే ఈసారి జాకెంట్ యొక్క ప్రాముఖ్యతని, ఇండియాలో దాని యొక్క అవసరాన్ని తెలియజేస్తూ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. యుద్ధ సమయాలలో, ఇతర విపత్తుల వల్ల చాలామంది ప్రజలు కట్టుబట్టలతో భార్యాబిడ్డలను తీసుకుని వేరే ప్రాంతానికి వలస వెళుతూ ఉంటారు. వీరు ఎక్కడికి అయితే వెళ్తారో అక్కడ వాళ్ళకి ఇల్లు ఉండదు.

ఇలాంటి పరిస్థితి ఎక్కువగా నైజీరియా, ఇరాన్, ఇండియా, చైనా, కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇరాక్, ఫ్లోరిడా వంటి దేశాలలో ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో కూడా నాలుగు కోట్ల మంది అడుక్కు తినేవాళ్లు ఉన్నారు. వాళ్లకి ఇల్లు లేకపోవడం వలన ఎండ వచ్చిన వాన వచ్చిన ఎక్కడ ఉండాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది అయితే వడదెబ్బతోను లేదంటే తీవ్రమైన చలికో చనిపోతున్నారు. అలాంటి వారందరి కోసం ఏంజెలా లూనా అనే ఒక మహిళ డిజైనర్ ఒక అద్భుతమైన డిజైన్ ని సృష్టించింది.

దాని పేరు జాకెంట్. జాకెట్ ప్లస్ టెంట్ ని కలిపి చేసిన డిజైన్ ఇది. దీనిని జాకెట్ లా వేసుకోవటంతో పాటు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టెంట్ లా వాడుకొని అందులో పడుకోవచ్చు. పైగా జాకెంట్ ఎంతోమంది సిరియా దేశస్తులను కాపాడింది. ఇప్పుడు ఆ జాకెట్టు ఇండియాకి వస్తే మనం కూడా ఏదైనా క్యాంప్ కి వెళ్ళినప్పుడు వాడుకోవటంతో పాటు అడుక్కునే వాళ్ళకి కూడా గిఫ్ట్ గా ఇవ్వచ్చు. ఏదైనా కంపెనీ దీనిని ఇండియాకి పరిచయం చేస్తే బాగుండు లేదంటే ఇక్కడే ఎవరైనా ఆ డిజైన్ ని డెవలప్ చేసినా ఎంతో మందిని రక్షించిన వాళ్ళు అవుతారు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశాడు పూరి జగన్నాథ్.

JACKENT | Puri Musings by Puri Jagannadh | Puri Connects | Charmme Kaur