Puja Hegde : ప్రస్తుతం దక్షిణాది సినిపరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది పూజ హెగ్డే. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతోంది.మంచి స్టార్ డమ్ తో అటు సౌత్ ను ఇటు నార్త్ ను కవర్ చేస్తోంది. బాలీవుడ్ లోనూ వరుస సినిమాలతో బిజీ గా ఉంటోంది పూజ.ఆ స్టార్ డమ్ కి తగ్గట్టుగానే.. హీరోలతో చాలా క్లోజ్ గా ఉంటుంది పూజా. తాజాగా బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రణ్ వీర్ సింగ్ సెట్ లో ఉంటే తనకు ఫుల్ ఎంటర్ టైన్‌మెంట్ ఉంటుందని.. రణ్ వీర్ ను ఎప్పుడూ కలిసిన తాను బాగా ఎంజాయ్ చేస్తాను అని పూజా చెప్పుకొచ్చింది.
పైగా ఓ షాకింగ్ విషయం కూడా చెప్పింది. రణ్ వీర్ సింగ్ ను తాను పమ్మీ ఆంటీ అని పిలుస్తానని పూజా చెప్పింది. ఇక రణ్ వీర్ సింగ్ తో కలిసి నటించిన సర్కస్ సినిమాలో తమ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుందని.. అందుకే మా జంట బాగా క్లిక్ అయ్యింది అని తెలిపింది పూజా. మొత్తానికి ‘పూజా హెగ్డే’ మొహమాటం లేకుండా ఉన్న విషయాలన్నీ వివరంగా వివరించింది.
ఇక పూజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.అయితే రణ్ వీర్ సింగ్ గురించి చేసిన కామెంట్స్ ను మాత్రం నెటిజన్లు బాగానే ట్రోల్ చేస్తున్నారు. నలుగురిని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నోళ్లు కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి అని, ఏ కామెంట్స్ పడితే.. ఆ కామెంట్స్ చెయ్యొద్దు అని నెటిజన్లు మెసేజ్ లు చేస్తున్నారు.