Project K మూవీ ఫస్ట్ గ్లింప్స్.. గేట్ రెడి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ Project K. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా ఈ చిత్రం సిద్ధమవుతోంది. వైజయంతీ మూవీస్ Project K చిత్రాన్ని నిర్మిస్తోంది. కమల్ హాసన్ మూవీలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అమితాబచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్ క్యాస్టింగ్ కూడా కీలక పాత్రలు చేస్తున్నారు.

ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఇండియన్ మైతలాజీకి అడ్వాన్స్ టచ్ ఇచ్చి చూపించబోతున్నారంట. అలాగే మూవీలో ప్రభాస్ సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రానటువంటి కాన్సెప్ట్ తో ఈ చిత్రం సిద్ధం అవుతోంది.

ముగ్గురి టాప్ స్టార్స్ సినిమాలో ఉండటంతో తెలుగు, తమిళ్, హిందీ భాషలలో సినిమాపై ఎక్కువ చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెల 20న మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ తో పాటు గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేశారు. యూఎస్ లోని శాన్ డియాగో కామిక్-కాన్ ఈవెంట్ లో Project K మూవీ టైటిల్ లాంచింగ్ ఉండబోతోంది.

ఇక ఈ ఈవెంట్ లోనే ఫస్ట్ గ్లింప్స్ ని కూడా లాంచ్ చేయబోతున్నారంట. దానిని నాగ్ అశ్విన్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఈ ఈవెంట్ లో హాలీవుడ్ ప్రముఖులు పాల్గొననున్నారంట. వారి సమక్షంలో Project K ఫస్ట్ గ్లింప్స్ ని లాంచ్ చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో సినిమాపై హైప్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు. ఇండియా నుంచి ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీగా దీనిని తీర్చిదిద్దబోతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు నాగ్ అశ్విన్ ఇప్పటి నుంచి పని మొదలు పెట్టారు. ఇండియన్ కాలమానం ప్రకారం యూఎస్ లో 20వ తేదీన గ్లింప్స్ లాంచ్ అయితే ఇండియాలో 21న లాంచింగ్ కాబోతోంది. మరి ఈ గ్లింప్స్ సినిమాపై ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.