ఏ హీరో ఫ్యాన్స్ కి అయితే తమ హీరోని ఇలా చూడాలి అలా చూడాలి అని కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి. అలాగే పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇప్పుడు నటిస్తున్న సెన్సేషనల్ చిత్రం “ప్రాజెక్ట్ కే” విషయంలో కూడా ఊహించనిది ప్రభాస్ ట్రై చేసి ఫ్యాన్స్ ని అయితే థ్రిల్ చేసాడు.
ఇది వరకు ప్రభాస్ చేసిన అన్ని సినిమాలు ఒకెత్తు ఈ ఒక్క సినిమా ఒకెత్తు అనే విధంగా అయ్యితే ఫస్ట్ లుక్ ని నిన్న చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు రిలీజ్ చేశారు. అయితే ఈ ఫస్ట్ లుక్ చూసిన వెంటనే అందరికీ ఒకింత షాక్ కి లోనయ్యారని చెప్పాలి.
పార్ట్స్ గా చూస్తే బాగానే ఉంది కానీ ఎడిటింగ్ మాత్రం టూ వరస్ట్ గా ఉందని కామెంట్స్ వచ్చాయి. పైగా ఎవరో బాడీ కి ప్రభాస్ ముఖాన్ని తగిలించినట్టు కూడా ఉందని ట్రోల్స్ చాలానే వచ్చాయి. అయితే ఈ ట్రోల్స్ అన్నిటినీ పాపం చాలా మంది డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా గట్టిగా డిఫెండ్ చేశారు.
తమకి ఫస్ట్ లుక్ తో ఎలాంటి ప్రాబ్లమ్ లేదని సూపర్ గా ఉందని మిగతా వారు కావాలనే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ ఓ రేంజ్ లో హైరానా పడిపోయారు. కానీ తీరా మొత్తం సీన్ కట్ చేస్తే డైరెక్ట్ గా నిన్న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ తమ సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసేసారు.
ఇది ఒక్కసారిగా షాకింగ్ గా మారగా దీని తర్వాత ఎలాంటి ఎడిటింగ్ పెద్దగా లేకుండా రియలిస్టిక్ గా ఉన్న పోస్టర్ ని అయితే వాటర్ మార్క్స్ లేని దాన్ని రిలీజ్ చేశారు. దీనితో పాపం మొదటిగా వదిలిన పోస్టర్ ని ఎంతగానో డిఫెండ్ చేసిన ఫ్యాన్స్ అందరినీ హోల్ సేల్ గా మేకర్స్ ఫూల్స్ ని చేసినట్టు అయ్యింది. దీనితో వారిని చూసి ఇతర నెటిజన్స్ నవ్వుకుంటున్నారు.
20 hours to go 💥
The Hero rises. From now, the Game changes 🔥
This is Rebel Star #Prabhas from #ProjectK.
First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).
To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/0EiA3RMlm5…@SrBachchan @ikamalhaasan… pic.twitter.com/G4McU7oAuS
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023