ప్రాజెక్ట్ K.. ఇన్నాళ్ళకు ఓ గుడ్ న్యూస్

దాదాపు ఆదిపురుష్ హడావిడి తుదిదశకు చేరుకుంది. ఈ సినిమా బారి డిజాస్టర్ దిశగా కొనసాగుతోంది. అయితే తదుపరి సినిమాల అప్డేట్స్ ద్వారా ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం కొంత ఊరటను కలిగించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం రెబల్ స్టార్ సలార్ సినిమాకు సంబంధించి తుది మెరుగులతో చాలా బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రానుంది.

ఆ తర్వాత ప్రాజెక్టు K తో ప్రభాస్ భారీ స్థాయిలో సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఆ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమాకు సంబంధించిన అసలు టైటిల్ ని ఇంకా రివిల్ చేయలేదు. ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయాల్సి ఉంది. అసలైతే దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఎప్పుడో విడుదల చేయాలని అనుకున్నాడు.

కానీ ప్రభాస్ ముందు అనుకున్న సినిమాల హడావిడి ముగిసిన తర్వాత ఈ ప్రాజెక్టు ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. ఇక మొత్తానికి ఆదిపురుష్ హడావిడి ముగిసింది కాబట్టి ఇప్పుడు సలార్ ప్రాజెక్ట్ K సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వైరల్ కాబోతున్నాయి.

ముఖ్యంగా ప్రాజెక్టు కే మోషన్ పోస్టర్ జూలై రెండవ వారం లేదా మూడో వారంలో విడుదల చేయానున్నారు. మోషన్ పోస్టర్ ను కూడా అమెరికాలో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ప్రభాస్ కు ప్రాజెక్ట్ K సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.