ఇండస్ట్రీ బజ్ : “ప్రాజెక్ట్ కే” బిగ్ అప్డేట్ డేట్ ఛేంజ్.?

950338-nag-ashwin-and-prabhas

పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూడు చిత్రాలు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ భారీ డిజాస్టర్స్ అయ్యాయి. అయినప్పటికీ వాటి ఫలితం తేడా కొట్టినా నెక్స్ట్ సినిమాలు మాత్రం అదరగొట్టేస్తాయి అనే కాన్ఫిడెన్స్ అయితే ఉన్న చిత్రాలు మాత్రం “సలార్” అలాగే ఆ తర్వాత అయితే “ప్రాజెక్ట్ కే” చిత్రాలు ఉండగా.

ఈ రెండు సినిమాలు పై కూడా సాలిడ్ అప్డేట్స్ ఈ జూలై లో రాబోతున్నట్టుగా కొన్ని రూమర్స్ ఉన్నాయి. అయితే మొదటి వారంలోనే రెండు సినిమాల అప్డేట్స్ ఉంటాయని రూమర్స్ ఉండగా ప్రాజెక్ట్ కే అప్డేట్  వారంలోనే ఉంటుంది అని టాక్ వచ్చింది. కానీ ఇపుడు అయితే ఈ డేట్ మారినట్టుగా తెలుస్తుంది.

జూలై మూడో వారంలో 20 లేదా 21న ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్ యూఎస్ నుంచి రిలీజ్ చేస్తున్నట్టుగా ఇపుడు వినికిడి. కాగా ఈ రెండు తేదీల్లో ఈ భారీ చిత్రం మోషన్ పోస్టర్ టీజర్ సహా సినిమా టైటిల్ ఏంటి అనేది రివీల్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. దీనితో అయితే ఎక్స్ట్రీమ్ మాసివ్ ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ ఆరోజున రానుంది అని చెప్పాలి.

కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటులు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె అలాగే దిశా పటాని నటిస్తుండగా టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఉలగనయగన్ కమల్ హాసన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారని క్రేజీ బజ్ ఈ చిత్రంపై ఉంది.