ఇటీవల నాలుగు రోజుల పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంటితో పాటు ఆఫీస్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సంఘటన పట్ల ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. అయితే ఈ సోదాలు ముగిసిన అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ, “సినీ పరిశ్రమలో బ్లాక్ మనీ అన్నది లేదు. ఇప్పుడు టికెట్ల బుకింగ్స్‌లో దాదాపు 80 శాతం ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. అందుకే బ్లాక్ మనీకి దారితీసే అవకాశం ఏమాత్రం లేదు” అని స్పష్టంచేశారు. ఇటీవల సినిమాలపై వస్తున్న ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ వల్ల పరిశ్రమపై ప్రభావం పడుతున్నాయా అనే ప్రశ్నకు స్పందిస్తూ, “ఈ అంశంపై పరిశ్రమలోని అందరం కలసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరు మాత్రమే ఈ విషయంపై మాట్లాడటం సరైనది కాదు” అన్నారు.
ఐటీ రెయిడ్స్.. దిల్ రాజు ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం..
ఇకపోతే రాజకీయ నాయకులు మీ సినిమాల్లో పెట్టుబడులు పెడుతున్నారా? అనే ప్రశ్నకు, “ఎవరైనా ఇలాంటి పెట్టుబడులు పెడితే మాకు కూడా వడ్డీల భారం తగ్గుతుంది. మీరు చెప్పగలిగితే మాకు కూడా చెప్పండి” అంటూ సరదాగా స్పందించారు.
అంతేకాకుండా, “గత ఐదేళ్లుగా నేను ఎటువంటి స్థిరాస్తులను కొనలేదు. ఎటువంటి ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టలేదు” అని ఆయన వివరించారు. సినీ పరిశ్రమలో పారదర్శకత పెరిగినప్పటికీ, ఇటువంటి సంఘటనలు నిర్మాతలను నిర్ధోషితంగా చూపించడానికి అవసరమయ్యే సందర్భాలు వస్తున్నాయని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. ఇది పరిశ్రమపై ఆర్థిక దృష్టితో వచ్చిన ప్రశ్నలను సమర్థవంతంగా సమాధానం చెప్పే అవకాశం కలిగించిందని అన్నారు.