అక్కినేని ఫ్యామిలీ గురించి దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు.. వారికి ఒక హీరోయిన్ సరిపోదంటూ కామెంట్స్?

Dil raju

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాతలలో దిల్ రాజు కూడా ఒకరు. మొదట డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసిన దిల్ రాజు ఆ తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించాడు. ప్రస్తుతం దిల్ రాజు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా దిల్ రాజు అక్కినేని కుటుంబం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో అక్కినేని నాగచైతన్యని జోష్ సినిమా ద్వారా పరిచయం చేసిన దిల్ రాజు ఇప్పుడు నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమాకి నిర్మాతగా మారాడు. విక్రమ్ కే. కుమార్ దర్శకత్వ వహించిన ఈ సినిమా ఈనెల 22వ తేదీ ప్రేక్షకుల ముందుకి రానుంది.

థాంక్యూ సినిమాలో నాగచైతన్య 3 పాత్రలలో ప్రేక్షకులని అలరించనున్నాడు. ఈ థాంక్యూ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ పనులలో చిత్ర బంధం బిజీగా ఉంది. నాగచైతన్య కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ని విడుదల చేశారు. తాజాగా జరిగిన థాంక్యూ సినిమా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో దిల్ రాజు పాల్గొని అక్కినేని ఫ్యామిలీ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ థాంక్యూ సినిమాలో నాగచైతన్య మూడు పాత్రలలో మనకి కనిపించని ఉన్నాడు. ఈ సినిమాలో నాగచైతన్యకి ముగ్గురు హీరోయిన్స్. టీనేజ్ లో ఒకరు కాలేజీలో ఒకరు లైఫ్ లాంగ్ ఒకరు అంటూ చెప్పుకొచాడు.

దిల్ రాజ మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు , నాగర్జున, నాగ చైతన్య, అఖిల్ ఇలా అక్కినేని కుటుంబంలోని హీరోలందరికీ ఒక హీరోయిన్ సరిపోదు. కచ్చితంగా వారు నటించిన సినిమాలలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సినిమా విశేషాల గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు నాగ చైతన్య పాత్రలోని భావాలతో ట్రావెల్‌ అవుతారు. సినిమా చూసి థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత మనకు ఇష్టమైన వారికి ఫోన్‌ చేసి కృతజ్ఞతలు చెబుతాం. అంతలా ఈసినిమాలో ప్రతి ఒక్కరిని కదిలించే భావోద్వేగాలుంటాయన్నారు. నాగార్జున కెరీర్ లో శివ, నిన్నే పెళ్లాడుతా, అన్నమయ్య సినిమాలు ఎంతగా గుర్తుండిపోయాయో ఆ తరహాలో ‘థాంక్యూ’ సినిమా కూడా చైతన్య కెరీర్ లో గొప్ప సినిమాగా మిగిలిపోతుంది’ అన్నారు.