పెద్ద సినిమాలతో వరుసగా చేతులు కాల్చుకుంటున్న అనీల్ సుంకర 

సినిమా అనేది చాలా మందికి ఇష్టం అలాగే వ్యాపారం కూడా అందుకే సినిమాల్లోకి వెళ్లిన వారు అంత తొందరగా బయటకి రాలేరు. ఎలాగైతే భారీ సక్సెస్ లు అందుకుంటారో అదే విధంగా దారుణమైన నష్టాలు కూడా ఎదుర్కోక తప్పదు. ఇక ఓ సినిమా మెటీరియలైజ్ కావాలి అంటే నిర్మాత లేకపోతే ఆ సినిమా లేదు.

హీరో దర్శకుడు అంతా ఉన్నా డబ్బులు పెట్టేవారు లేకపోతె ఏ సినిమా కూడా లేదు. అయితే అలా ఇపుడు టాలీవుడ్ లో ఇన్నేళ్ల కెరీర్ లో హాఫ్ హాఫ్ సక్సెస్ రేట్ లో ఉన్న నిర్మాత అనిల్ సుంకర పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అని చెప్పాలి రీసెంట్ టైం లో తాను నిర్మాణం వహించిన ఏ చిత్రం కూడా హిట్ కాలేదు.

కానీ తాను ప్రెజెంట్ చేసిన చిన్న చిన్న చిత్రాలు మాత్రం భారీ బాక్సాఫీస్ సక్సెస్ సాధించాయి. కానీ వీటి సక్సెస్ లు తాను ఖర్చు పెట్టి చేసిన భారీ చిత్రాలకి ఎలాంటి ప్లస్ కాలేదు. తాను ఈ ఏడాది చేసిన రెండు చిత్రాలు ఏజెంట్, అలాగే మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ రెండు భారీ బడ్జెట్ సినిమాలే కానీ ఆశ్చర్యంగా ఈ చిత్రాలు రెండు కూడా భారీ నష్టాలే నిర్మాతకి ఇచ్చాయి.

ఏజెంట్ మొదటి రోజుకే తేలిపోయింది కానీ భోళా శంకర్ కి తప్పకుండ నష్టాలు తప్పవని చెప్పడంలో సందేహం లేదు. జనం ఏమాత్రం ఆసక్తి ఈ సినిమా పట్ల చూపించడం లేదు దీనితో మొదటి రోజు కేవలం 20 శాతం కూడా జరిగిన బిజినెస్ లో ఇది రికవర్ చెయ్యలేదు. దీనితో మరో అనిల్ సుంకర కి చేతులు కాలాయి అని చెప్పాలి.

తాను లాస్ట్ చేసిన పెద్ద సినిమా “సరిలేరు నీకెవ్వరు” చిత్రానికి మాత్రమే ఓవర్ ఫ్లో వసూళ్లు భారీ లెవెల్లో వచ్చాయి. దీనితో అక్కడ భారీ లాభాలు అందుకున్న తాను నెక్స్ట్ చేసిన పెద్ద చిత్రాలతో వాటికి డబుల్ పోగొట్టుకోక తప్పలేదు. దీనితో పెద్ద సినిమాలు మాత్రం ఇప్పుడు అనీల్ సుంకరకి అచ్చి రావడం లేదనే చెప్పాలి.