ఎలాన్ మస్క్ ని సపోర్ట్ చేసిన ప్రియాంక చోప్రా భర్త.. భర్తని అదుపులో పెట్టుకోమంటూ ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

కొన్ని రోజుల క్రితం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయిన టెస్లా హెడ్ హోంచో ఎలాన్ మస్క్, టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ యొక్క ఎక్స్ పోస్ట్ పై స్పందించారు. 2024 యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ గెలిచిన నేపథ్యంలో కంపెనీ లాభం పెరిగిందని పేర్కొన్నారు. అయితే దీనికి ప్రతిస్పందిచాడు నిక్ .

ఎలాన్ మస్క్ తన వేలు చూపుతున్న చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 3000 సంవత్సరాల వరకు మీరే మమ్మల్ని ముందుకు తీసుకువెళ్లాలి అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఎంత ఫాస్ట్ గా వైరల్ అయిందంటే చాలా తక్కువ సమయంలో 27.1 మిలియన్ల వ్యూస్ నమోదు చేసుకుంది. అయితే నిక్ ఎలాన్ మస్క్ ని సపోర్ట్ చేయడం చాలా మందికి మింగుడు పడలేదు. నీ భర్తని ఇప్పుడే అదుపులో పెట్టుకో అని కొందరు ప్రియాంక చోప్రా కి మెసేజ్లు పెట్టారు.

అతను భయంకరమైన వ్యక్తి అతని వద్ద నుంచి ఫోన్ ఇప్పుడే తీసుకో అని మరికొందరు పోస్టులు పెట్టారు. మరికొందరైతే ప్రియాంకని టార్గెట్ చేస్తూ నీవు స్త్రీవాదాన్ని సపోర్ట్ చేస్తావనుకున్నాం, కానీ మీరు పెళ్లి చేసుకునే వ్యక్తికి అలాంటి మనస్తత్వం ఉందని నేను నమ్మలేకపోతున్నాను అంటూ ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు. మరొక వ్యక్తి అయితే అతను నా ట్వీట్ తొలగించినా పర్వాలేదు అతను ఎలాంటి వ్యక్తి అని ఇప్పుడు మాకు తెలిసిపోయింది అంటూ కామెంట్ పెట్టాడు.

మరొక వ్యక్తి మీరు భిన్నంగా ఉన్నారని అనుకున్నాను క్షమించండి నేను మిమ్మల్ని అనుసరించలేను ఇకపై నేను మీ అభిమానిని కాదు అంటూ ట్వీట్ చేశాడు. కొంతమంది అయితే నిక్ చేసిన ట్వీట్ ని వెనక్కి తీసుకోమని కామెంట్స్ చేశారు. మరి ఈ విషయంపై ప్రియాంక దంపతులు ఎలా రెస్పాండ్ అవుతారు చూడాలి. ఇకపోతే తాజాగా ఈ దంపతులు సౌదీ అరేబియాకు అకేషన్ కి వెళ్ళింది అక్కడ ఎడారిలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక.