ఇండియన్ హాలీవుడ్ యాక్టర్ గా ప్రస్తుతం దూసుకుపోతున్న అందాల భామ ప్రియాంకా చోప్రా. ఈ అమ్మడు బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా సక్సెస్ చూసి అక్కడి నుంచి క్వాంటికో వెబ్ సిరీస్ తో హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా హాలీవుడ్ లోనే సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తోంది.
తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ తో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అన్ని భాషలలో ఈ వెబ్ సిరీస్ కి అద్భుతమైన స్పందన వస్తూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే ఆమె హాలీవుడ్ లో చేసిన లవ్ అగైన్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో ఆమె పాల్గొని తన వ్యక్తిగత జీవితానికి సంబందించిన ఇంటరెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
పెళ్లికి ముందు తాను చాలా మందితో డేట్ చేసానని ప్రియాంకా చోప్రా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్టార్ హీరోలతో కూడా తాను డేట్ చేయడం జరిగిందని ప్రియాంకా చెప్పుకొచ్చింది. అలాగే తన భర్త నిక్కి జోనస్ కూడా పెళ్ళికి ముందు చాలా మందితో డేట్ చేసాడని చెప్పించింది. అలాగే తాను మిస్ వరల్డ్ అయ్యే సమయానికి తన భర్తకి ఏడేళ్ళు అని చెప్పింది.
ఇదిలా ఉంటే శృంగారం, రిలేషన్ షిప్ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. లవ్ అగైన్ లో తన సహనటుడుతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఫస్ట్ డేట్ కి వెళ్ళిన రోజునే శృంగారం చేయడంపై మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్నకి ఆసక్తికరంగా సమాధానం చెప్పింది. ఫస్ట్ డేట్ రోజునే శృంగారం నాకు ఒకే అని చెప్పేసింది.
అలాగే ఇష్టం లేని వ్యక్తికి రాంగ్ నెంబర్ ఇవ్వడంలో తప్పుందా అంటే లేదని చెప్పింది. దీంతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబందించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలని శృంగారం గురించి నర్మగర్భంగా ప్రియాంకా చోప్రా సమాధానాలు చెప్పడం విశేషం.