ఇండియన్ హాలీవుడ్ యాక్టర్ ప్రియాంకా చోప్రా తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకుంటుంది. మరో వైపు లవ్ అగైన్ అనే మూవీ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం ప్రియాంకా బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా లవ్ అగైన్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియాంకా చోప్రా కి ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ లెవల్ లో పాపులర్ అయ్యి ఆస్కార్ గెలుచుకుంది. ఈ చిత్రాన్ని మీరు చూసారా అని అడిగారు. అయితే తాను సినిమాలు తక్కువ చూస్తానని ఆర్ఆర్ఆర్ చూసేంత టైమ్ లేదని ప్రియాంకా చెప్పడం విశేషం. ఫ్రీ టైమ్ దొరికితే ఏవైనా షోలు మాత్రమే చూస్తూ ఉంటానని పేర్కొంది. రామ్ చరణ్ ని ఇండియన్ బ్రాడ్ ఫిట్ అని అందరూ ప్రశంసిస్తున్నారు.
ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారా అని అడిగారు. కచ్చితంగా ఒప్పుకుంటా. రామ్ చరణ్ ఉత్సాహంగా ఉండటంతో పాటు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని ప్రియాంకా పొగడటం విశేషం. అయితే రామ్ చరణ్, బ్రాడ్ ఫిట్ లలో ఎవరు అందంగా ఉంటారు అనే ప్రశ్న యాంకర్ అడిగారు. అయితే దీనికి సమాధానం చెప్పలేనని ప్రియాంకా పేర్కొంది.
బ్రాడ్ ఫిట్ తన చిన్నప్పటి క్రష్. చిన్నప్పటి నుంచి అతని సినిమాలు చూస్తూ పెరిగాను. ఇక రామ్ చరణ్, తారక్ లకి ప్రపంచ స్థాయిలో అభిమానులు ఉన్నాయి. వారు తమ టాలెంట్ తో ఈ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్నారు అంటూ ప్రియాంకా చోప్రా పేర్కొంది. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ ని కలిసానని, ఆసందర్భంగా మాట్లాడటం జరిగిందని కూడా ప్రియాంకా చోప్రా రివీల్ చేసింది.
మొత్తానికి ప్రియాంకా రామ్ చరణ్, తారక్ మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా ఆయా హీరోల అభిమానులు వాటిని ట్రెండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఆర్ఆర్ఆర్ సినిమా చూడటానికి టైమ్ లేదని చేసిన కామెంట్స్ పై నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.