ప్రియమణి లవ్ స్టోరీ.. ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్న ప్రియమణి!

Priyamani: నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.కెరియర్ పరంగా ప్రియమణి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఆమె ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఆ ప్రేమ పెళ్లిలో కూడా ఎన్నో వివాదాలు ఉన్నాయి. అప్పటికే పెళ్ళయిన ముస్తాఫ్ రాజ్ నిప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియమణి తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా తన పెళ్లి గురించి వార్తలు వచ్చాయి.

ఇలా తన ప్రేమ పెళ్లి విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రియమణి తాజాగా ఢీ వేదికపై కూడా కంటెస్టెంట్ లు తన లవ్ స్టోరీని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ క్రమంలోనే తన చిన్ననాటి విషయాలను అలాగే తాను ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది, తన ప్రియుడు ముస్తఫా రాజ్ ను ఎలా కలుసుకుంది అలాగే తన పెళ్లి తర్వాత సమాజం తనను అవమానించిన తీరు అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారు.

ఈ విధంగా తన లవ్ స్టోరీని వేదికపై చూడటంతో ప్రియమణి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇలా ఈమె ఎమోషనల్ కావడంతో తనని వేదికపైకి ఆహ్వానించి ఒక బహుమతి అందజేశారు. మరి ఆ బహుమతి ఏమిటి ప్రియమణి ఇలా ఎమోషనల్ అవ్వడానికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలు అన్నింటి గురించి తెలియాలంటే వచ్చేవారం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.